Begin typing your search above and press return to search.

దేవరకొండ టార్గెట్ ఎంత..?

అయితే విజయ్ దేవరకొండ ఈ సినిమాతో భారీ టార్గెట్ నే పెట్టుకున్నాడని తెలుస్తుంది. సినిమాతో రౌడీ హీరో 100 కోట్ల దాకా గురి పెట్టాడట.

By:  Tupaki Desk   |   18 Feb 2024 8:04 AM GMT
దేవరకొండ టార్గెట్ ఎంత..?
X

ఖుషి తర్వాత విజయ్ దేవరకొండ నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ లాక్ చేశారు. ఎన్.టి.ఆర్ దేవర సినిమా రిలీజ్ అనుకున్న ఆ డేట్ న ఫ్యామిలీ స్టార్ వస్తుంది.

గీతా గోవిందం తో రికార్డ్ హిట్ అందుకున్న పరశురాం విజయ్ దేవరకొండ మరోసారి ఆ హిట్ ని రిపీట్ చేయాలని చూస్తున్నారు. అందుకు తగినట్టుగానే ఫ్యామిలీ స్టార్ ని తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ నుంచి ఫ్యాన్స్ ఆశిస్తున్న అన్ని అంశాలు ఫ్యామిలీ స్టార్ సినిమాలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా విజయ్ రేంజ్ కి తగినట్టుగా పెట్టారట.

సమ్మర్ లో స్టార్ సినిమాలు వస్తాయనుకున్న ఆడియన్స్ కు ఫ్యామిలీ స్టార్ ట్రీట్ ఇవ్వనున్నారు. అయితే విజయ్ దేవరకొండ ఈ సినిమాతో భారీ టార్గెట్ నే పెట్టుకున్నాడని తెలుస్తుంది. సినిమాతో రౌడీ హీరో 100 కోట్ల దాకా గురి పెట్టాడట. సినిమాను పాతిక కోట్ల దాకా ఖర్చు కాగా సినిమా 40 కోట్ల దాకా బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ సినిమా మంచి టాక్ వస్తే తప్పకుండా మంచి రెవిన్యూ తెచ్చే ఛాన్స్ ఉంటుంది.

ఫ్యామిలీ స్టార్ కి మృణాల్ ఠాకూర్ కూడా ఒక పాజిటివ్ అంశమే అని చెప్పొచ్చు. ఆల్రెడీ అమ్మడి ఖాతాలో రెండు హిట్లు ఉన్నాయి. సీతారామం తో సూపర్ హిట్ అందుకున్న అమ్మడు ఆ సినిమా తర్వాత హాయ్ నాన్నతో మరో సక్సెస్ అందుకుంది. ఈ రెండు సక్సెస్ ల తర్వాత ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఫ్యామిలీ మెన్ గా కనిపించనున్నాడు. సినిమా నుంచి వచ్చిన టీజర్, మొదటి సాంగ్ సినిమాపై బజ్ పెరిగేలా చేసింది. మరి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరితో స్పై థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది.