Begin typing your search above and press return to search.

గోవర్ధన్‌ 'ఫ్యామిలీ స్టార్‌' ఇలా అయ్యాడట భయ్యా..!

విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్ గా రూపొందిన మోస్ట్‌ వెయిటెడ్‌ మూవీ ఫ్యామిలీ స్టార్‌ విడుదలకు సిద్ధం అయ్యింది.

By:  Tupaki Desk   |   3 April 2024 7:57 AM GMT
గోవర్ధన్‌ ఫ్యామిలీ స్టార్‌ ఇలా అయ్యాడట భయ్యా..!
X

విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్ గా రూపొందిన మోస్ట్‌ వెయిటెడ్‌ మూవీ ఫ్యామిలీ స్టార్‌ విడుదలకు సిద్ధం అయ్యింది. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తాజా ఇంటర్వ్యూలో రౌడీ స్టార్‌ పంచుకున్నాడు.

ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ... తాము మొదట ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్‌ అనుకోలేదు. సినిమాలో నా పాత్ర పేరు గోవర్ధన్ విజయ్‌. మొదట పాత్ర పేరునే టైటిల్‌ గా అనుకున్నాం. గోవర్ధన్‌ అనే పేరుతో సినిమా వస్తే జనాలు కచ్చితంగా కనెక్ట్‌ అవుతారని అనుకున్నాం.

గోవర్ధన్‌ అనే టైటిల్‌ కంటే కూడా కథ కు తగ్గట్లుగా ఉండే ఫ్యామిలీ స్టార్ టైటిల్‌ అయితే జనాల్లోకి మరింత ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంది. అంతే కాకుండా సినిమాకు మంచి పబ్లిసిటీ కూడా ఉంటుందనే ఉద్దేశ్యంతో టైటిల్‌ ను మార్చినట్లుగా విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

ఈ సినిమాలో చూపించే కథ ప్రతి ఫ్యామిలీకి కనెక్ట్‌ అవుతుందని అన్నాడు. తెలుగు ఫ్యామిలీ కి ఒక చక్కని ఉదాహరణ ఈ సినిమాలో లభిస్తుందని కూడా రౌడీ స్టార్‌ అన్నాడు. ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్‌ చేసిన ఫ్యామిలీ స్టార్‌ మంచి సమ్మర్‌ సీజన్ లో, సెలవు రోజుల్లో రాబోతున్నాడు.

ఓపెనింగ్స్ పై దిల్‌ రాజు చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే పాతుకు పోయి ఉన్న టిల్లు స్క్వేర్ సినిమా ను దాటుకుని ఈ సినిమాకు వసూళ్లు రావాల్సి ఉంది. అంటే కంటెంట్‌ కాస్త గట్టిగా ఉండాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దిల్‌ రాజు అండ్ టీమ్‌ చాలా నమ్మకంగా ఫ్యామిలీ స్టార్‌ పై కనిపిస్తున్నారు.

ఖుషి తర్వాత రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ నుంచి రాబోతున్న సినిమా ఇదే. ఇక మృణాల్‌ ఠాకూర్ బ్యాక్ టు బ్యాక్‌ సీతారామం మరియు హాయ్ నాన్న సినిమాలు చేసి విజయాలను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.