Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్ కి కావాల్సినంత స్పేస్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సక్సెస్ కోసం చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   27 March 2024 4:28 AM GMT
ఫ్యామిలీ స్టార్ కి కావాల్సినంత స్పేస్
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సక్సెస్ కోసం చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాడు. గత ఏడాది ఖుషితో ఎక్స్ పెక్ట్ చేసిన హిట్ వస్తుందని ఆశించినప్పటికి అనుకున్నంత రేంజ్ లో క్లిక్ కాలేదు. ఆ మూవీ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. వరుసగా నాలుగు డిజాస్టర్స్ తర్వాత ఖుషి విజయ్ దేవరకొండకి కొంత ఊరటని ఇచ్చింది. అయితే విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ హిట్ చూసి చాలా కాలం అయ్యింది.

ఎట్టి పరిస్థితిలో సూపర్ హిట్ కొట్టి తిరిగి తన ఇమేజ్ ని, మార్కెట్ ని స్ట్రాంగ్ చేసుకోవాలని విజయ్ దేవరకొండ అనుకుంటున్నాడు. అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఫ్యామిలీ స్టార్ చిత్రంతో వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. గీతాగోవిందం లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పరశురామ్ మరోసారి అలాంటి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తో ఫ్యామిలీ స్టార్ మూవీ చేశారు.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకి జోడీగా క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటిస్తూ ఉండటం అదనపు అస్సెట్. ఈ బ్యూటీ వరుసగా రెండు సూపర్ హిట్స్ ని ఖాతాలో వేసుకొని హ్యాట్రిక్ పై కన్నేసింది. ఆమె లక్ ఫ్యాక్టర్ ఫ్యామిలీ స్టార్ ద్వారా విజయ్ దేవరకొండకి కలిసొచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. విజయ్, మృణాల్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుందనే అభిప్రాయం ఆడియన్స్ నుంచి వస్తోంది.

ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ నెలలో ఫ్యామిలీ స్టార్ తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ రావడం లేదు. కానీ అంతకంటే వారం ముందు మార్చి 29న టిల్లు స్క్వేర్ ఒక్కటే రేసులో ఉంటుంది. అంటే ఫ్యామిలీ స్టార్ మూవీకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కట్టడం గ్యారెంటీ. మూవీపైన ఎలాగూ బజ్ ఉంది కాబట్టి సాలిడ్ ఓపెనింగ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాకి ఈ రిలీజ్ డేట్ మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. కరెక్ట్ గా వర్క్ అవుట్ అయితే రెండు, మూడు వరాల పాటు సినిమాకి మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న బ్లాక్ బస్టర్ అందుకోవడానికి మంచి స్కోప్ దొరికింది. ఫ్యామిలీ కంటెంట్ తో వస్తోన్న మూవీ కావడంతో పబ్లిక్ ని థియేటర్స్ వైపు రప్పించడానికి హాలిడేస్ కూడా దొరుకుతున్నాయి. మరి ఈ అవకాశాన్ని విజయ్ దేవరకొండ ఎలా ఉపయోగించుకుంటాడు అనేది చూడాలి.