Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్.. ఇప్పుడే గట్టిగా ఇవ్వాలి

గీతాగోవిందం తర్వాత విజయ్ కి టాక్సీవాలాతో హిట్ కొట్టాడు. అయితే గీతాగోవిందం రేంజ్ మూవీ మళ్ళీ విజయ్ ఖాతాలో పడలేదు.

By:  Tupaki Desk   |   2 March 2024 4:06 AM GMT
ఫ్యామిలీ స్టార్.. ఇప్పుడే గట్టిగా ఇవ్వాలి
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి యూత్ లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంతే స్థాయిలో ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఉంది. దానికి కారణం గీతాగోవిందం మూవీ. ఆ సినిమాలో లవర్ గా, బాధ్యతాయుతమైన కొడుకుగా విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఫ్యామిలీ హీరో అనిపించుకునే లక్షణాలు విజయ్ దేవరకొండలో పుష్కలంగా ఉన్నాయని ఆ సినిమా ప్రూవ్ చేసింది.

గీతాగోవిందం తర్వాత విజయ్ కి టాక్సీవాలాతో హిట్ కొట్టాడు. అయితే గీతాగోవిందం రేంజ్ మూవీ మళ్ళీ విజయ్ ఖాతాలో పడలేదు. గత ఏడాది వచ్చిన ఖుషి మూవీ కూడా అతన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసింది. యూత్ కి పెద్దగా కనెక్ట్ కాకపోవడం వలన ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీతో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతున్నాడు.

పరశురాం దర్శకత్వంలో గీతాగోవిందం తర్వాత విజయ్ చేస్తోన్న రెండో మూవీ ఇది కావడం విశేషం. ఫ్యామిలీ స్టార్ నుంచి ఇప్పటికే ఓకే సాంగ్ వచ్చి హిట్ అయ్యింది. గ్లింప్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందులో డైలాగ్ కూడా భాగా వైరల్ అయ్యింది. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ ను ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం డైరెక్టర్ పరశురాం చేస్తున్నారంట. టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసే విధంగా కట్ చేయనున్నట్లు టాక్. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ఈ టీజర్ ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. సినిమాపై ఇప్పటికే పాజిటివ్ వైబ్ నడుస్తోంది.

కచ్చితంగా ఈ సినిమాతో విజయ్ ఖాతాలో మంచి బ్లాక్ బస్టర్ హిట్ పడే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. దిల్ రాజు కూడా ఫ్యామిలీ స్టార్ మూవీపై చాలా నమ్మకంగా ఉన్నారు. సర్కారువారిపాట సినిమా తర్వాత పరశురామ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా ఫ్యామిలీ స్టార్ చేరబోతుందని సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ హీరోలకి గోల్డెన్ లెగ్ గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమె ఖాతాలో సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో రెండు హిట్స్ చేరాయి. ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ పడే ఛాన్స్ అయితే కనిపిస్తోంది.