Begin typing your search above and press return to search.

రాజమౌళి ముత్తాతలు అన్ని దారుణాలు చేశారా?

టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకున్నారు.

By:  M Prashanth   |   20 Feb 2026 5:45 PM IST
రాజమౌళి ముత్తాతలు అన్ని దారుణాలు చేశారా?
X

టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత ఈయన సొంతం. ఎప్పుడూ తన కథలతో ప్రేక్షకులను థ్రిల్ చేసే విజయేంద్ర ప్రసాద్, రీసెంట్‌గా ఒక ఈవెంట్‌లో పాల్గొని తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు.

తన పూర్వీకులు చేసిన కొన్ని పనుల గురించి చెబుతూ స్టేజ్ పైనే చాలా ఎమోషనల్ అయ్యారు. ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈవెంట్‌లో మాట్లాడుతూ తమది చాలా సంపన్న కుటుంబమని విజయేంద్ర ప్రసాద్ గుర్తుచేసుకున్నారు. అయితే ఆ సంపద వెనుక ఉన్న కొన్ని చేదు నిజాలను కూడా బయటపెట్టారు. తన తాతలు, ముత్తాతలు గతంలో కొన్ని దారుణాలకు పాల్పడ్డారని, ఆ విషయాలు ఇప్పుడు తలచుకుంటే సిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తోందని కంటతడి పెట్టారు.

మాటల్లో చెప్పలేనన్ని ఘోరాలు చేశారని, ఆ పాపాల్లో తాను కూడా భాగస్వామినేనని పరోక్షంగా ఒప్పుకున్నారు. సాధారణంగా ఇలాంటి విషయాలు ఎవరూ బయటపెట్టడానికి ఇష్టపడరు. కానీ విజయేంద్ర ప్రసాద్ ఏమాత్రం తడుముకోకుండా అందరి ముందు నిజాయితీగా మాట్లాడటం నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది. తన వంశం గురించి చెబుతూనే, గతంలో జరిగిన తప్పులకు క్షమాపణలు కోరారు.

స్టేజ్ పై తలవంచి వినయంగా అందరికీ నమస్కరిస్తూ క్షమించమని వేడుకోవడం అక్కడున్న వారందరినీ కదిలించింది. తనలోని పశ్చాత్తాపాన్ని ఈ విధంగా వ్యక్తం చేసి అందరి మనసు గెలుచుకున్నారు. ఈ మాటలు విన్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలాంటి నిజాలు ఒప్పుకోవడానికి చాలా ధైర్యం ఉండాలని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గతాన్ని మార్చలేకపోయినా, చేసిన తప్పును అంగీకరించడం గొప్ప విషయమని ప్రశంసిస్తున్నారు.

మరికొందరు మాత్రం అప్పట్లో ఏం జరిగి ఉంటుందో అని ఆరా తీస్తున్నారు. ఏదేమైనా స్టేజ్ మీద ఈయన చూపించిన నిజాయితీ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం తన కొడుకు రాజమౌళి తో కలిసి కొన్ని భారీ ప్రాజెక్టులకు కథలు అందిస్తున్నారు. సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా, సామాజిక అంశాల మీద కూడా స్పందిస్తుంటారు. ఇప్పుడు తన ఫ్యామిలీ హిస్టరీ గురించి ఇలా ఓపెన్ గా మాట్లాడటం వెనుక బలమైన కారణమే ఉండి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏదేమైనా విజయేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. జరిగిన తప్పుల గురించి తలచుకుని కుంగిపోకుండా, వాటిని ఒప్పుకుని క్షమాపణ కోరడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. ఈ ఎమోషనల్ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు రాజమౌళి మహేష్ బాబుతో వారణాసి సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.