Begin typing your search above and press return to search.

VD 14: శపించబడిన భూమిలో ఎవరా యోధుడు?

ఇక నేడు పుట్టినరోజు కావడంతో విజయ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేస్తూ ఉన్నాయి

By:  Tupaki Desk   |   9 May 2024 6:04 AM GMT
VD 14: శపించబడిన భూమిలో ఎవరా యోధుడు?
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక లెక్క ఇకనుంచి రాబోయే సినిమాలో మరొక లెక్క అనే విధంగా అతని లైనప్ ఉండబోతున్నట్లుగా అర్థమవుతుంది. రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ అంతకు ముందు లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో ఖుషి సినిమా చేశాడు. వేటికవే భిన్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న ఈ టాలెంటెడ్ హీరో ఇప్పుడు అంతకుమించి అనేలా మరిన్ని విభిన్నమైన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా అనిపిస్తోంది.

ఇక నేడు పుట్టినరోజు కావడంతో విజయ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేస్తూ ఉన్నాయి. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. గతంలోనే వీరి కాంబినేషన్ లో టాక్సీవాలా అనే సినిమా వచ్చింది. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది.

ఇక ఇప్పుడు ఒక చారిత్రాత్మక అంశాన్ని వెండితెరపై చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. 1854 - 1878 మధ్యలో చోటుచేసుకున్న ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని టచ్ చేస్తూ దర్శకుడు ఒక యోధుడి కథను ఆవిష్కరించబోతున్నట్లు పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో అతనికి విషెస్ అందిస్తూ ఈ ఆసక్తికరమైన పోస్టర్ ను మరింత ట్రెండ్ అయ్యేలా చేశారు.

ఇక శపించబడిన భూమిలో ఒక లెజెండ్ కదా ఎలా కొనసాగింది అనే పాయింట్ తో ఆ సినిమా ఉండబోతుంధని పోస్టర్ లో మెన్షన్ చేసిన తీరు ఆసక్తిగా ఉంది. భారతదేశంలో ఎంతో మంది యోధులకు సంబంధించిన కథలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇక అలాంటి వాటిని వెలికి తీసి వెండితెరపై ఆవిష్కరించడం అనేది మంచి విషయం.

కాబట్టి తప్పకుండా ఈ సినిమాపై అన్ని వర్గాల ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఏర్పడతాయి అని చెప్పవచ్చు. ఇలాంటి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ ఆలోచన తీరు కూడా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకోవాలని రెడీ అవుతున్నాడు. మొదటి సారి అతను ఒక హిస్టారికల్ పాయింట్ టచ్ చేస్తున్నాడు. ఇక అతను చేయబోయే క్యారెక్టర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి.

దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కూడా తన ప్రతి సినిమాలో ఒక మిస్టరీ పాయింట్ ను కూడా హైలెట్ చేస్తూ ఉంటాడు. చివరగా వచ్చిన శ్యామ్ సింఘారాయ్ సినిమాలో కూడా అతను మిస్టరీ ఎలిమెంట్ ను చాలా చక్కగా హైలైట్ చేసాడు. ఇక ఇప్పుడు విజయ్ తో చేస్తున్న సినిమా కూడా అంతకుమించి అనేలా ఉండబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా భారీ బడ్జెట్లోనే విడుదల చేయబోతున్నారు.