Begin typing your search above and press return to search.

దేవరకొండ నెక్స్ట్.. ఎంతవరకు వచ్చిందంటే..

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. ఇటీవల ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   19 April 2024 5:20 AM GMT
దేవరకొండ నెక్స్ట్.. ఎంతవరకు వచ్చిందంటే..
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. ఇటీవల ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా మెప్పించినప్పటికీ.. కమర్షియల్ గా అంచనాలు అందుకోలేకపోయింది. పరశురామ్ తెరకెక్కించిన ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా.. ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే అనుకున్న తేదీ కన్నా ముందే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తునట్లు తెలుస్తోంది. మే3వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అప్డేట్ రానుంది. ఇన్నాళ్లు ఫ్యామిలీ స్టార్ తో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ.. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా మొదలుపెట్టారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో పీరియాడిక్ స్పై థ్రిల్లర్ మూవీ కంటిన్యూ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. శ్రీలీల హీరోయిన్ గా మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కానీ డేట్స్ అడ్జెస్ట్ అవ్వక శ్రీలీల.. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆమె ప్లేస్ లో మమిత బైజు, భాగ్యశ్రీ బొర్సే పేర్లు ఆ మధ్య వినిపించాయి. కానీ హీరోయిన్ ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో దేవరకొండపై కొన్ని కీలక యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు మేకర్స్.

త్వరలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలు కానున్నట్లు సమాచారం. అందుకు గాను మూవీ టీమ్ అంతా వైజాగ్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 28వ తేదీ నుంచి కొద్ది రోజుల పాటు అక్కడ షూటింగ్ చేయనున్నారు మేకర్స్. దీనిపై అఫీషియల్ అప్డేట్ ఇవ్వనున్నారు. ఇటీవల వైజాగ్ లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, నితిన్ తమ్ముడు మూవీల షూటింగ్ జరిపారు మేకర్స్. ఇప్పుడు VD 12 టీమ్ కూడా అక్కడికే వెళ్లనుంది.

భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ స్పై థ్రిల్లర్ ను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మొదటిసారి స్పై యాక్షన్ జానర్ లో విజయ్ దేవరకొండ చేస్తున్న ఈ సినిమా 2024లో విడుదల అవ్వనున్నట్లు సమాచారం. మరో ఈ మూవీతో అయినా విజయ్ మళ్లీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.