Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ.. ఇక నుంచి మరొక లెక్క!

విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   9 May 2024 4:30 PM GMT
విజయ్ దేవరకొండ.. ఇక నుంచి మరొక లెక్క!
X

విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించింది. ప్రస్తుతం తన కొత్త సినిమాలపై విజయ్ ఫోకస్ పెట్టారు. నేడు బర్త్ డే సందర్భంగా.. కొత్త సినిమాల అప్డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఫుల్ ఫిదా చేశారు విజయ్.

నెక్స్ట్ మూడు సినిమాలు కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతున్నాయి. ఈ మూడు సినిమాలు వేటికవే భిన్నంగా ఉండడమే కాకుండా విజయ్ కెరీర్ లో.. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి రాబోయే సినిమాలు మరొక లెక్క.. అనే తరహాలో ఉండబోతున్నట్లు చెప్పవచ్చు. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్న విషయం తెలిసిందే.

విజయ్ ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైజాగ్ లో సినిమాలోని ఓ మాసివ్ సీన్ ను షూట్ చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఇక రీసెంట్ గా దిల్ రాజు.. విజయ్ తో మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రాజావారు రాణిగారు ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ.. రూరల్ యాక్షన్ డ్రామా జోనర్ లో ఓ మూవీ చేయనున్నారు.

తాజాగా కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే.. అంటూ రక్తంతో తడిసిన చేయి కత్తి పట్టుకుని ఉన్న పోస్టర్ ను VD 13 మేకర్స్ రిలీజ్ చేశారు. ఇదొక ఫ్యాక్షన్ డ్రాప్ సినిమా కాగా మరోవైపు, విజయ్.. టాక్సీవాలాతో తనకు మంచి హిట్ అందించిన రాహుల్ సాంకృత్యాన్ తో మరోసారి చేతులు కలిపారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. శపించబడి భూమి నుంచి వచ్చిన ఓ యోధుడి కథను సినిమాగా తీస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇందులో ఒక హిస్టారికల్ పాయింట్ చాలా బలంగా ఉండబోతున్నట్ల తెలుస్తోంది.

అయితే విజయ్ కొత్త సినిమాల అప్డేట్స్ చూసి ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. మరోవైపు, సినీ వర్గాల్లో ఇప్పుడు విజయ్ ఫ్యూచర్ కెరీర్ గురించి చర్చ జరుగుతోంది. కొత్త చిత్రాల అప్డేట్స్ చూశాక.. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అనేలా విజయ్ కెరీర్ ఉండబోతుందని అంతా అంటున్నారు. చెప్పాలంటే విజయ్ నెక్స్ట్ సినిమాల కథలు వేటికవే భిన్నంగా ఉన్నాయి. మూడు కాన్సెప్టులు కూడా ఆసక్తి రేపుతున్నాయి.

ఆ మూడు సినిమాలను తెరకెక్కిస్తున్న దర్శకులు గౌతమ్ తిన్ననూరి, రవి కిరణ్ కోలా, రాహుల్ సాంకృత్యాన్ కూడా ఫుల్ టాలెంటెడ్ అని చెప్పవచ్చు. గత చిత్రాలతో వీరు ముగ్గురూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు విజయ్ ను కొత్త చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఇక రౌడీ హీరో కొత్త సినిమాల ప్రొడ్యూసర్స్, ప్రొడక్షన్ హౌసెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు.. భారీ బడ్జెట్ తో విజయ్ నెక్స్ట్ చిత్రాలను తెరకెక్కిస్తున్నాయి. ఇలా అన్ని విధాలుగా చూసుకుంటే.. దేవరకొండ కొత్త సినిమాలు వేరే లెవల్ లో ఉండనున్నట్లు కనిపిస్తుంది. మరి ఆ మూడు సినిమాలు.. రౌడీ హీరో కెరీర్ ను ఎంత ఎత్తుకు తీసుకెళ్తాయనేది వేచి చూడాలి.