Begin typing your search above and press return to search.

ఈ క్రేజీ కాంబో సెట్ చేయొచ్చుగా..!

మరోపక్క పూజా హెగ్దే థై షోకి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఈ ఇద్దరు కలిసి నటించింది లేదు

By:  Tupaki Desk   |   3 March 2024 5:59 AM GMT
ఈ క్రేజీ కాంబో సెట్ చేయొచ్చుగా..!
X

సినిమా కథ కథనాలు ఎలా ఉన్నా కొన్ని కాంబినేషన్స్ సెట్ అయితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ కాంబినేషన్ పై ఆడియన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉంటారు. అయితే ఆల్రెడీ ఒక సినిమాకు పనిచేసిన వారైతే ఓకే కానీ ఇదివరకు కలిసి చేయని హీరో హీరోయిన్ గురించి కూడా ఆడియన్స్ అంచనాలు పెట్టుకుంటారు. అలాంటి కాంబినేషన్ లోనే ఒకటి విజయ్ దేవరకొండ, పూజా హెగ్దే జోడీ. రౌడీ హీరోగా అమ్మాయిల మనసు గెలుస్తున్న విజయ్ దేవరకొండ యూత్ ఆడియన్స్ కు హా**ట్ ఫేవరెట్ అయ్యాడు.

మరోపక్క పూజా హెగ్దే థై షోకి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఈ ఇద్దరు కలిసి నటించింది లేదు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ జన గణ మన సినిమా అనౌన్స్ చేశాడు. కొంత పార్ట్ షూట్ కూడా చేశారు. ఆ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దే నటించాల్సి ఉంది. లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ ఆ సినిమా వద్దానుకోగా అలా పూజా బేబీతో రొమాన్స్ మిస్ అయ్యింది.

లేటెస్ట్ గా చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్ లో విజయ్ దేవరకొండ, పూజా హెగ్దే కలిసి అటెండ్ అయ్యారు. స్టేజ్ మీద విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమాలో నందనందన సాంగ్ కి పూజా హెగ్దే కూడా స్టెప్ వేసింది. ఈ ఇద్దరిని అలా పక్క పక్కన చూసి ఆడియన్స్ అంతా ఈ ఇద్దరు జోడీగా సినిమా వస్తే బాగుంటుందని కోరుతున్నారు. తెలుగులో ప్రస్తుతం అవకాశాలు లేక వెనకపడ్డ పూజా హెగ్దే ఎలాంటి ఛాన్స్ వచ్చినా చేస్తానని అంటుంది.

విజయ్ దేవరకొండ కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. గౌతం తిన్ననూరి తో విజయ్ చేసే సినిమాలో హీరోయిన్ గా త్రిప్తి, రుక్మిణి వసంత్ ఫిక్స్ అయ్యారని టాక్. ఒకవేళ ఆ సినిమాలో హీరోయిన్స్ ఎంపిక ఫైనల్ అవ్వకపోతే పూజా హెగ్దేని తీసుకోవడం బెటర్ అని రౌడీ ఫ్యాన్స్ చెబుతున్నారు. విజయ్ తో పూజా హెగ్దే జత కడితే ఆ ఇద్దరి రొమాన్స్ ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. టాలీవుడ్ లో సడెన్ గా గ్రాఫ్ పడిపోయిన పూజా హెగ్దే ఎలాగైనా మళ్లీ తిరిగి ఇక్కడ ఫాం కొనసాగించాలని చూస్తుంది. విజయ్ సినిమాలో ఛాన్స్ వస్తే మాత్రం అమ్మడికి పర్ఫెక్ట్ కం బ్యాక్ అని చెప్పొచ్చు.