Begin typing your search above and press return to search.

దేవరకొండ.. మరో పెద్ద ప్రయోగమే!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   25 April 2024 11:50 AM GMT
దేవరకొండ.. మరో పెద్ద ప్రయోగమే!
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించారు. వేసవి కానుకగా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 5వ తేదీన విడుదలైన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ అందుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించినప్పటికీ.. యూత్ ను మాత్రం ఆకట్టుకోలేకపోయింది ఈ మూవీ.

అయితే విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న మూవీతో బిజీగా ఉన్నారు. నిజానికి ఫ్యామిలీ స్టార్ కన్నా ముందే ఈ సినిమా ప్రారంభమైనా.. మధ్యలో బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ VD12 షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు దేవరకొండ. పీరియాడిక్ స్పై థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఆడియన్స్ కు ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు గౌతమ్ ప్రస్తుతం ఈ మూవీ పై పూర్తి ఫోకస్ పెట్టి షూటింగ్ ను జరుపుతున్నారట. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి యంగ్ బ్యూటీ శ్రీలీల తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె స్థానాన్ని ప్రేమలు అమ్మడు మమితా బైజు లేదా మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సేతో మేకర్స్ రీ ప్లేస్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

దీంతో ఈ సినిమాలో పాటలు అదిరిపోతాయని చాలామంది ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు పాటల విషయంలో షాకింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో అసలు పాటలే ఉండవని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే వినిపిస్తుంటోందని తెలుస్తోంది. సినిమా స్టోరీ మూడ్ ను పోగొట్టకుండా ఉండడానికి మేకర్స్ ఇలా చేస్తున్నారట. ఒకట్రెండు సన్నివేశాల్లో చిన్న బిట్స్ ఉన్నా.. అవి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాగా హై ఎమోషన్స్ కోసం మాత్రమే వాడుతున్నారని టాక్.

ఇప్పుడు ఈ విషయం తెలిసి నెటిజన్లతో పాటు సినీ ప్రియులు షాక్ అయిపోతున్నారు. విజయ్ దేవరకొండ మరో ప్రయోగం చేస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కనుక పాటలపై మంచి అంచనాలు పెట్టుకున్నామని చెబుతున్నారు. అన్నా ఈ ప్రయోగం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఏం చేసినా దేవరకొండకు మంచి హిట్ అవ్వాలని మేకర్స్ కు ఆయన ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.