Begin typing your search above and press return to search.

దేవరకొండ అన్న.. ఎందుకిలా?

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా విజయ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది

By:  Tupaki Desk   |   3 April 2024 7:07 PM GMT
దేవరకొండ అన్న.. ఎందుకిలా?
X

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా విజయ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మరికొద్ది గంటల్లో ఆయన నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ సినిమా గీత గోవిందం తర్వాత మరోసారి డైరెక్టర్ పరశురామ్ పెట్లతో చేతులు కలిపారు విజయ్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ఈ సినిమాలో నటించింది.

ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. వాటిని ప్రమోట్ చేసే విధానంలో కొత్తగా ఆలోచిస్తుంటారు విజయ్ దేవరకొండ. ఖుషి మూవీ టైమ్ లో స్టార్ హీరోయిన్ సమంతతో ఆయన ఇచ్చిన పర్ఫామెన్స్ అలాంటిదే. ఇక మంగళవారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా వెరైటీగా ఎంట్రీ ఇచ్చారు విజయ్. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను బైక్ పై ఎక్కించుకుని స్టైలిష్ ఔట్ ఫిట్ తో ఈవెంట్ లోకి ప్రవేశించారు.

అయితే మృణాల్ ను బైక్ పై ఎక్కించుకున్న తర్వాత.. అక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఎదురుగా ఉన్నారు. బైక్ వెళ్ళడానికి వీలు అవ్వడం లేదు. దీంతో విజయ్.. అరే జరగండ్రా నీ** అంటూ గట్టిగా అరిచారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది. పబ్లిక్ లో అసలు అవేం మాటలు బ్రో అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. విజయ్ భాష అంతేనని, ఎవరినీ కావాలని అనలేదని విజయ్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు.

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం గ్రాండ్ గా జరిగింది. స్టేజ్ పై విజయ్ తన స్పీచ్ తో అదరగొట్టారు. కచ్చితంగా ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టనున్నట్లు నమ్మకంతో కనిపించారు. రెండేళ్ల క్రితం ఆయన నటించిన లైగర్ తీవ్రంగా నిరాశపరిచింది. అందుకు విజయ్ విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. గతేడాది విడుదలైన ఖుషి సినిమా పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఈ సినిమాతో గట్టి హిట్ కొట్టాలని చూస్తున్నారు.

ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. సమ్మర్ హాలీడేస్ కూడా కలిసి రానున్నాయి. ఈ సినిమాతో మృణాల్ ఠాకూర్.. హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. మరి ఈ మూవీ ఏప్రిల్ 5న విజయ్‌ తోపాటు మృణాల్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.