Begin typing your search above and press return to search.

రూ.2 షాంపూ ప్యాకెట్‌లో నీళ్ళు వేస్తున్నా..VDకి రిప్లై!

మెగాస్టార్ చిరంజీవి- విజ‌య్ దేవ‌ర‌కొండ స్పెష‌ల్ ముఖాముఖి ఇంట‌ర్వ్యూ ఇప్పుడు గూగుల్ లో ట్రెండింగ్ గా మారింది

By:  Tupaki Desk   |   1 April 2024 7:18 PM GMT
రూ.2 షాంపూ ప్యాకెట్‌లో నీళ్ళు వేస్తున్నా..VDకి రిప్లై!
X

మెగాస్టార్ చిరంజీవి- విజ‌య్ దేవ‌ర‌కొండ స్పెష‌ల్ ముఖాముఖి ఇంట‌ర్వ్యూ ఇప్పుడు గూగుల్ లో ట్రెండింగ్ గా మారింది. ఓవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన `ఫ్యామిలీ స్టార్` సినిమాని ప్ర‌మోట్ చేస్కుంటూనే, మిడిల్ క్లాస్ పై మెగాస్టార్ నోటి వెంట ఆణిముత్యాల్లాంటి విష‌యాల్ని రాబ‌ట్టాడు విజయ్.

షాంపూ బాటిల్ ఖాళీ అయిపోగానే అందులో నీళ్లు వొంపి గిల‌క్కొట్టి దానిని పూర్తి చేస్తే కానీ త‌న‌కు కుద‌ర‌ద‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ ఎంతో ఓపెన్ గా చెప్ప‌గా, మిగిలిపోయిన స‌బ్బు బిళ్ల‌ల‌న్నీ ఒక రాయిలా ఉండ‌గా చుట్టి మ‌రో వారం పాటు ఉప‌యోగిస్తాన‌ని చిరంజీవి త‌మ‌లోని మ‌ధ్య‌త‌ర‌గ‌తి మ‌న‌స్త‌త్వాన్ని బ‌య‌ట‌పెట్టారు. దాప‌రికం లేకుండా బ‌హిరంగ వేదిక‌పై దీనిని వారు చ‌ర్చించ‌డంపై కొంద‌రి నుంచి ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. చాలా మంది నెటిజ‌నులు దీనిపై ఆస‌క్తిక‌రంగా స్పందించారు.

నేను రూ.2 షాంపూ ప్యాకెట్‌లో నీళ్ళు వేస్తున్నాను అని ఒక నెటిజ‌న్ స్పందించ‌గా, ఇలాంటివి విన్న‌పుడే చాల మందికి గర్వం త‌గ్గుతుంది..నేను అట్ల ఎట్ల అని చెప్పుకునే వాళ్ల‌కు గ‌ర్వం త‌గ్గాలి..అని వేరొక‌రు స్పందించారు.

మీకు సిల్లీ గా ఉండచ్చు కానీ.. పుట్టుకతో వచ్చిన పిసినారి బుద్ధులు ఎంత రిచ్ అయినా పోవు..అది వాళ్ల‌కి తెలీకుండానే అలా రియాక్ట్ అయిపోతారు. డబ్బులో పుట్టినోళ్ల‌కు అసలు అర్థం కాదు.. అని మ‌రొక నెటిజ‌న్ స్పందించాడు. విజయ్ ఇప్పుడు పరిపక్వత చెందాడు.. అత‌డు ఇంటర్వ్యూలో చాలా మంచి ప్రశ్నలు అడిగాడు.. చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.. అని మ‌రొకరు ప్ర‌శంసించారు. చాలా మంది మిడిల్ క్లాస్ మెంటాలిటీ గొప్ప‌ద‌ని సెల‌విచ్చారు.