Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్.. గ్లామర్ డోస్ గట్టిగానే..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్

By:  Tupaki Desk   |   23 March 2024 4:35 AM GMT
ఫ్యామిలీ స్టార్.. గ్లామర్ డోస్ గట్టిగానే..
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు ఈ చిత్రాన్ని క్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సిద్ధం చేయించారు. గీతాగోవిందం తర్వాత అలాంటి క్లాస్ టచ్ తోనే పరశురామ్ మరోసారి విజయ్ దేవరకొండని సిల్వర్ స్క్రీన్ పై చూపించబోతున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

సాంగ్స్ కూడా కనెక్ట్ అయ్యాయి. దీంతో ఫ్యామిలీ స్టార్ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. రౌడీ స్టార్ ఏ సినిమా చేసిన అందులో క్యారెక్టరైజేషన్ ఎలా ఉందో అదే తరహాలో బయట కూడా తనని తాను రిప్రజెంట్ చేసుకుంటూ ప్రమోషన్స్ చేస్తాడు. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ కోసం విజయ్ లుంగీలో దిగిపోయాడు.

ఈ సినిమాకు గ్లామర్ క్యాస్ట్ గట్టిగానే కలిసొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రేండింగ్ లోనే ఉన్న బ్యూటీలే సినిమాలో హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మూవీలో ఏకంగా నలుగురు హీరోయిన్స్ కనిపించబోతున్నారంట. మెయిన్ హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఓ కీలకపాత్రలో దివ్యాంశా కౌశిక్ మెరవబోతోంది. అలాగే అమెరికన్ యాక్టర్ మరిస్సా రోజ్ గార్డన్ ఫ్యామిలీ స్టార్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈమె పాత్ర ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంచారు.

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఓ సాంగ్ లో కనిపించబోతోందని తెలుస్తోంది. గెస్ట్ అప్పీరియన్స్ గా రష్మిక పాత్ర ఉండబోతోందంట. ఇలా నలుగురు హీరోయిన్స్ ఫ్యామిలీ స్టార్ చిత్రంలో కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఫ్యామిలీ స్టార్ మీద మరింత క్రేజ్ ఆడియన్స్ లో పెరిగింది. విజయ్, రష్మికల కాంబినేషన్ లో సినిమా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఫ్యామిలీ స్టార్ లో కొద్దిసేపు ఫ్యాన్స్ కి ఆ ట్రీట్ ని పరశురామ్ ఇవ్వబోతున్నాడు. ఇదిలా ఉంటే ప్యూర్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ లవ్ ఎలిమెంట్ మూవీగా గా ఈ చిత్రాన్ని పరశురామ్ సిద్ధం చేసాడు. దీంతో ఇప్పటికే మూవీ బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. కచ్చితంగా విజయ్ దేవరకొండ ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

ఇక మరోవైపు విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అందులో విజయ్ మొదటిసారి ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అలాగే లిస్టులో మరో రెండు కథలు కూడా చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే వాటిపై కూడా ఈ రౌడి స్టార్ స్పెషల్ ఎనౌన్స్ మెంట్ ఇవ్వనున్నాడు. ఇక ఫ్యామిలీ స్టార్ ముందుగా విజయ్ గా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.