Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ మారిపోయాడు!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన సినిమాలను చాలా దూకుడుగా ప్రమోట్ చేస్తుంటారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు

By:  Tupaki Desk   |   2 April 2024 1:00 PM GMT
విజయ్ దేవరకొండ మారిపోయాడు!
X

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన సినిమాలను చాలా దూకుడుగా ప్రమోట్ చేస్తుంటారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'అర్జున్ రెడ్డి' మూవీ నుంచి మొన్నటి 'ఖుషి' వరకు కూడా ప్రమోషన్స్ విషయంలో అదే అగ్రెసివ్ నెస్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. తన ప్రచారంతోనే సినిమాకు కావాల్సినంత బజ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించే ఈవెంట్స్, ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలలో రౌడీ హీరో యాటిట్యూడ్.. అతని కామెంట్స్ అప్పుడప్పుడు కాంట్రావర్సీ అవుతుంటాయి. అయితే ఒకప్పుడు ప్రమోషన్స్ లో హైపర్ యాక్టీవ్ మోడ్‌లో ఉండే విజయ్.. ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్' విషయంలో చాలా కూల్ గా ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ.. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో విజయ్ అండ్ టీమ్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటిల్లో విజయ్ ఇంతకముందుగా కాకుండా, పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రమోషన్స్‌లో కూడా అతను చాలా సెన్సిబుల్‌గా, ప్రశాంతంగా కూల్ గా కనిపిస్తున్నారు. సినిమాలో తాను పోషించిన గోవర్ధన్ పాత్రకు తగ్గట్టుగా, బయట కూడా ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ ను కంటిన్యూ చేస్తూ వస్తున్నారు.

ఇటీవలి 'ఫ్యామిలీ స్టార్‌' ప్రెస్ మీట్ లో మీడియా సంధించిన కొన్ని వివాదాస్పద ప్రశ్నలకు కూడా విజయ్ దేవరకొండ తనదైన శైలిలో నవ్వుతూ సమాధానమిచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. తన ఫైనాన్సియల్ మ్యాటర్స్, రెమ్యునరేషన్ గురించి, పెళ్లి గురించి చెప్పమన్నా కూడా అలానే స్పందించారు. ఏది అడిగినా ఎంతో మెచ్యూర్ గా, చాలా జాగ్రత్తగా ఆలోచించి జవాబులు చెప్తున్నారు. మూవీని ప్రమోట్ చేస్తున్నప్పుడు కొత్త డ్రెస్సింగ్ స్టైల్‌ని ఫాలో అవుతున్నారు. ఎక్కువగా సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే, సినిమా రిలీజ్ కు ముందు అనవసరపు వివాదాల్లోకి వెళ్లకూడదని విజయ్ నిర్ణయించుకున్నట్లు అనిపిస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

నిజానికి విజయ్ దేవరకొండ సినిమాలతో పాటుగా రియల్ లైఫ్ యాటిట్యూడ్ తోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నారు. పాన్ ఇండియాని టార్గెట్ చేస్తూ చేసిన 'లైగర్' మూవీ ప్రమోషన్స్ లో అతని కామెంట్స్ కు, సినిమా రిజల్ట్స్ కు అసలు పొంతన లేకపోవడం పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఎదుర్కొనేలా చేసింది. సినిమా కలెక్షన్స్ 200 కోట్ల నుంచి ప్రారంభం అవుతాయని.. ఇండియా మొత్తం షేక్ అవుతుందని.. ఆగ్ లగా దేంగే అంటూ విజయ్ ఇచ్చిన స్టేట్మెంట్స్ టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారాయి. ఇవే సినిమా డిజాస్టర్ గా మారిన తర్వాత సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొనేలా చేసాయి. అందుకేనేమో 'ఫ్యామిలీ స్టార్' విషయంలో విజయ్ ఎలాంటి ప్రకటనలు చేయకుండా.. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే మంచి సినిమా అవుతుందని చెబుతూ వస్తున్నారు.

'ఫ్యామిలీ స్టార్' సినిమా ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ ను మంచి స్పందన లభించింది. ఇది సినిమాకి కావాల్సినంత బజ్ తెచ్చిపెట్టింది. సమ్మర్ స్పెషల్ గా రాబోతున్న ఈ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.