Begin typing your search above and press return to search.

VD 13: ఫ్యామిలీ ఎమోషన్స్ మాత్రమే కాదు..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి ఏవరేజ్ టాక్ సొంతం చేసుకున్నారు

By:  Tupaki Desk   |   30 Sep 2023 1:30 PM GMT
VD 13: ఫ్యామిలీ ఎమోషన్స్ మాత్రమే కాదు..
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి ఏవరేజ్ టాక్ సొంతం చేసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి మాత్రం సంవత్సరానికి రెండు సినిమాలు కచ్చితంగా తన నుంచి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగా దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.

మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకి జోడీగా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఇంటరెస్టింగ్ విషయాలు బయటకొచ్చాయి. VD13 చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ ఎలిమెంట్స్ బలంగా ఉంటాయంట. పరశురామ్ కి ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో కథలు చెప్పడం అంటే ఇష్టం. అందుకే గీతాగోవిందం తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందంట. సినిమాలో 4 యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బలంగా ఉండబోతున్నాయంట. ఇవి సినిమాకి హైలైట్ గా ఉంటానే మాట వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ, పరశురామ్ అంటే ఆడియన్స్ ఓకే ఎక్స్ పెక్టేషన్స్ తో వస్తారు. అయితే మరల గీతాగోవిధం తరహాలోనే సినిమా చేస్తే పోలిక పెడతారని భావించి కాస్తా మార్పులు చేసి యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా మిళితం చేస్తున్నారంట.

కచ్చితంగా ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ కెరియర్ లో బ్లాక్ బస్టర్ వస్తుందని భావిస్తున్నారు. ఈ మూవీతో పాటుగా గౌతం తిన్ననూరి దర్శకత్వంలో కూడా విజయ్ దేవరకొండ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా సెట్స్ పైన ఉంది. మూవీలో శ్రీలీలని హీరోయిన్ గా ముందు ఎంపిక చేశారు. డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆమె తప్పుకోవడంతో రష్మిక మందన కన్ఫర్మ్ అయ్యింది.

విజయ్ దేవరకొండ రష్మిక మందన కాంబినేషన్ లో ఇది మూడో సినిమా అవుతుంది. పరశురామ్ దర్శకత్వంలో మూవీకి అదిరిపోయే టైటిల్ కూడా ఇప్పటికే ఖరారు చేశారంట. త్వరలో అధికారికంగా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.