Begin typing your search above and press return to search.

విజ‌య్ కు ఆ పేరే ముద్దా? ట్యాగులొద్దా?

విజయ్ దేవరకొండ.. తన పేరు ముందు 'ది' అని ఎందుకు పెట్టుకున్నారు? మిగతా హీరోల్లా ట్యాగ్ ఎందుకు పెట్టుకోలేదు? అని అంతా మాట్లాడుకున్నారు.

By:  Tupaki Desk   |   31 March 2024 9:04 AM GMT
విజ‌య్ కు ఆ పేరే ముద్దా? ట్యాగులొద్దా?
X

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోలందరి పేర్ల ముందు ఏదో ఒక ట్యాగ్ ఉంటుంది. ఇటీవల ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరోల పేర్ల ముందు కూడా ఏదో ఒక స్టార్ లేదా ట్యాగ్ ఉండడం కామన్ అయిపోయింది. ఇక టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు సొంతగా పెట్టుకున్న ట్యాగ్ లేదు. గతం కొంతకాలంగా రౌడి స్టార్ అనే ట్యాగ్ తోనే ఫ్యాన్స్ పిలుచుకుంటున్నారు. గత ఏడాది విడుదలైన ఖుషి సినిమా బ్యానర్లపై విజయ్ దేవరకొండ పేరు ముందు 'ది' అని వేశారు మేకర్స్. అప్పట్లో ఆ టైటిల్ ఫుల్ వైరల్ అయింది.

విజయ్ దేవరకొండ.. తన పేరు ముందు 'ది' అని ఎందుకు పెట్టుకున్నారు? మిగతా హీరోల్లా ట్యాగ్ ఎందుకు పెట్టుకోలేదు? అని అంతా మాట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ నడిచింది. కానీ విజయ్ దేవరకొండ ఎక్కడా ఈ విషయంపై స్పందించలేదు. ఇక త్వరలో విడుదల కానున్న ఫ్యామిలీ స్టార్ మూవీ బ్యానర్లపై కూడా 'ది' విజయ్ దేవరకొండ అనే వేశారు మేకర్స్. దీంతో మళ్లీ ఆ 'ది' కోసమే చర్చించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్య్వూలో 'ది' ట్యాగ్ పై స్పందించారు విజయ్. "ఇండస్ట్రీలో అన్ని టైటిల్స్ అందరూ తీసుకున్నారు. తలా, తలైవా, సూపర్ స్టార్.. ఇలా చాలా ట్యాగ్స్ ను పలువురు హీరోలు తీసుకున్నారు. పేరు ముందు ఏదో ట్యాగ్ పెట్టి పిలవడం కన్నా.. విజయ్ దేవరకొండ అనే పిలిస్తేనే నాకు ఇష్టం. అమ్మానాన్న నాకు పెట్టిన పేరుతో సంతోషంగా ఉన్నా" అని తెలిపారు.

"అయితే నాతో సినిమాలు తీసే నిర్మాతలు.. ఆ మధ్య కొన్ని ట్యాగ్స్ సజ్జెస్ట్ చేశారు. వాటిని విని ఊరుకున్నా. ఇక రౌడీ స్టార్ అని అంతా రాస్తున్నారు. అందుకే సింపుల్ గా 'ది' యాడ్ చేసుకున్నాను. 'ది' విజయ్ దేవరకొండ చాలా సింపుల్ గా బాగుంటుంది. నాకు ఇదే నచ్చింది. ఇంకా ఎలాంటి ట్యాగ్స్ వద్దు" అని క్లారిటీ ఇచ్చారు విజయ్. ప్రస్తుతం దేవరకొండ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. కానీ ఇప్పటి వరకు పేరు ముందు ఎలాంటి ట్యాగ్ లేదు. రౌడీ హీరో ఉన్నా.. వాడడానికి వీలు లేకుండా చిల్లరగా ఉంటుంది. ఇక విజయ్ ఏమో ట్యాగ్ ల కన్నా తల్లిదండ్రులు పెట్టిన పేరే ముద్దు అంటున్నారు. నిర్మాతలిస్తామన్నా వద్దంటున్నట్లు చెబుతున్నారు. అయితే ట్యాగ్స్ ఇవ్వాల్సింది నిర్మాతలు కాదని, రచయితలు, దర్శకులు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. విజయ కు తన పేరే ముద్దా? మిగతా ఎలాంటి ట్యాగులు వద్దా? అని మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ.. 'ది' ట్యాగ్ పై ఎప్పటికప్పుడు చర్చ నడుస్తూనే ఉంది