Begin typing your search above and press return to search.

దేవరకొండ.. మంచి ఛాన్స్ కొట్టేశాడుగా!

ఫ్యామిలీ స్టార్ మూవీ విడుదలయ్యాక వరుసగా ఉగాది, ఈద్ పండుగలు వస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. మౌత్ టాక్ పాజిటివ్ గా వస్తే చాలని, మూవీ మంచి వసూళ్లు సాధిస్తుందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   17 March 2024 4:38 AM GMT
దేవరకొండ.. మంచి ఛాన్స్ కొట్టేశాడుగా!
X

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గీతా గోవిందం మూవీతో విజయ్ కు సూపర్ హిట్ ఇచ్చిన పరశురామ్.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. వేసవి కానుకగా మరికొద్ది వారాల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు, సాంగ్స్ మంచి అంచనాలు నెలకొల్పాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, డైరెక్టర్ ఆనందంగా హగ్ చేసుకున్నారు. షూట్ పూర్తైనట్లు వీడియో కూడా పోస్ట్ చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసి.. ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

అయితే లైగర్ మూవీతో ఘోర పరాజయం అందుకున్న విజయ్.. ఖుషీ మూవీతో డీసెంట్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీతో భారీ హిట్ కొట్టాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక ఆ నెలలో ఫ్యామిలీ స్టార్ కాకుండా చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ అవ్వడం లేదు. దీంతో విజయ్ కు గోల్డెన్ ఛాన్స్ దక్కిందని సినీ పండితులు చెబుతున్నారు.

ఫ్యామిలీ స్టార్ మూవీ విడుదలయ్యాక వరుసగా ఉగాది, ఈద్ పండుగలు వస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. మౌత్ టాక్ పాజిటివ్ గా వస్తే చాలని, మూవీ మంచి వసూళ్లు సాధిస్తుందని చెబుతున్నారు. మొత్తానికి ఈ మూవీని సరైన టైంలోనే రిలీజ్ చేస్తున్నారని, పండుగల టైమ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా బెస్ట్ ఛాయిస్ అవుతుందని అంటున్నారు. దిల్ రాజు.. సంక్రాంతికి వాయిదా వేసి, ఇప్పుడు భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారని చెబుతున్నారు.

ఈ సినిమాలో కుటుంబ బాధ్యతలు చూసుకునే ఫ్యామిలీ మ్యాన్‌ గా, బయటేమో రౌడీల బెండు తీసే పవర్‌ ఫుల్‌ మ్యాన్‌ గా హీరో విజయ్‌ దేవరకొండ కనిపించనునట్లు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా అర్థమవుతోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తుండ‌గా.. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. మరి విజయ్ దేవరకొండ.. ఈ సినిమాతో గట్టి కమ్ బ్యాక్ ఇస్తారో లేదో చూడాలి.