Begin typing your search above and press return to search.

దేవరకొండ.. అన్నీ టచ్ చేస్తున్నాడుగా..

పీరియాడికల్ క్రైమ్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోందని, ఇందులో విజయ్ పవర్‌‌‌‌‌‌‌‌ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

By:  Tupaki Desk   |   26 Feb 2024 12:23 PM GMT
దేవరకొండ.. అన్నీ టచ్ చేస్తున్నాడుగా..
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం తనకు గీతా గోవిందం మూవీతో సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ పరుశురాంతో కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించనున్న విజయ్ కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. వేసవి కానుకగా ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరితో ఓ మూవీ చేయనున్నారు విజయ్. మార్చి రెండో వారంలో ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ క్రైమ్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోందని, ఇందులో విజయ్ పవర్‌‌‌‌‌‌‌‌ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

అయితే కెరీర్ లో తొలిసారి ఖాకీ డ్రెస్ లో కనిపించనున్నారు విజయ్. కంప్లీట్ గా కొత్త లుక్, స్టోరీ కూడా ఫ్రెష్ గా ఉండనుందట. గౌతమ్ తిన్ననూరి ఇప్పటికే తీసిన జెర్సీ మూవీలాగే ఈ సినిమా కూడా కొత్త అనుభూతిని కలిగించనుందట. ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం శ్రీలంకలోనే జరగనుందట. 2024లో ఈ మూవీ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

ఈ పీరియాడికల్ క్రైమ్ మూవీ తర్వాత.. విజయ్ మరో జానర్ ను టచ్ చేయడానికి సిద్ధమవుతున్నారట. రాజా వారు రాణి గారు సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రవికిరణ్ కోలాతో సినిమా చేయనున్నారు విజయ్. దిల్ రాజు నిర్మించనున్న ఈ మూవీ.. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందట. విజయ్ లుక్ నుంచి ఆయనను ప్రజెంట్ చేసే తీరు వరకు ప్రతీది కూడా కొత్తగా ఉంటుందట.

ఇక ఆ మధ్య.. టాక్సీవాలాతో మంచి హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరో సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే స్టోరీ విని విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. రాయలసీమ బ్యాక్‍ డ్రాప్‍ లో మూవీ ఉండనుందని సమాచారం. మొత్తానికి విజయ్ కొత్త ప్రాజెక్టులన్నీ డిఫరెంట్ కాన్సెప్టులతో రానున్నాయన్నమాట. మరి విజయ్ కొత్త చిత్రాలు ఎలా ఉంటాయో చూడాలి.