Begin typing your search above and press return to search.

రెమ్యునరేషన్ గురించి విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే..

ఇక ప్రస్తుతం మార్కెట్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం విజయ్ పారితోషికం 20 కోట్ల కంటే పైనే ఉంటుందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   2 April 2024 8:31 AM GMT
రెమ్యునరేషన్ గురించి విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే..
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలి అని అనుకుంటున్నాడు. ఎందుకంటే అతను పూర్తి స్థాయిలో సక్సెస్ చూసి చాలాకాలమైంది. చివరిగా వచ్చిన ఖుషి సినిమా టాక్ పరంగా పరవాలేదు అనిపించినప్పటికీ కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్నంత స్థాయిలో లాభాలను అందించలేకపోయింది.

ఇక అంతకంటే ముందు వచ్చిన లైగర్ సినిమా అయితే మరి దారుణంగా డిజాస్టర్ అయింది. కాబట్టి ఈసారి విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఫ్యామిలీ లవ్ స్టోరీ గా రాబోతున్న ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని ప్రమోషన్స్ లో గట్టిగానే చెబుతున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ అనేక రకాల విషయాలను తెలియజేశాడు. మిడిల్ క్లాస్ నుంచే తాను ఇక్కడ వరకు వచ్చాను అని ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.

ఇక విజయ్ రెమ్యునరేషన్ గురించి కూడా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ముఖ్యంగా గీతగోవిందం సినిమా భారీ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. దీంతో విజయ్ పారితోషకం గట్టిగానే పెరిగి ఉంటుంది అని చాలామంది అనుకున్నారు. అయితే ఈ క్రమంలో విజయ్ స్పందిస్తూ కుషి సినిమా కంటే ముందు వరకు కూడా తాను చాలా తక్కువగా తీసుకున్నాను అంటూ అవి ఒక వేరుశనగలతో సమానం అన్నట్లు తనదైన శైలిలో తెలియజేశాడు

అయితే కుషి సినిమా నుంచి తనకు మంచి రెమ్యునరేషన్ వస్తుంది అంటూ.. ఇప్పుడు తాను చాలా హ్యాపీగా రీజనబుల్ రేటు అందుకుంటున్నట్లుగా వివరణ ఇచ్చాడు. అంతేకాకుండా కోవిడ్ సమయంలో కొంత డబ్బులు అవసరం ఉంటే దిల్ రాజు గారి నుంచి అడ్వాన్స్ గా కొంత తీసుకున్నట్లు చెప్పాడు. స్టార్ ఇమేజ్ వచ్చినా కూడా దాన్ని అలానే కొనసాగించడం అంత ఈజీ కాదు అని విజయ్ చెప్పిన మాటలను బట్టి అర్థమవుతుంది.

ఇక ప్రస్తుతం మార్కెట్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం విజయ్ పారితోషికం 20 కోట్ల కంటే పైనే ఉంటుందని తెలుస్తోంది. ఇక ఫ్యామిలీ స్టార్ సక్సెస్ అయితే ఈ హీరో లెక్క మరింత పెరుగుతుంది అని చెప్పవచ్చు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5వ తేదీన తెలుగు తమిళంలో ఒకేసారి విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి.