Begin typing your search above and press return to search.

లైగర్ 200 కోట్ల కామెంట్.. అది తప్పే కానీ..: విజయ్ దేవరకొండ

"ఏదో ఒక రోజు కచ్చితంగా నేను రూ.200 కోట్లు కొడతాను. అది కొట్టే వరకు మీరు నన్ను ఎంతైనా తిట్టండి. నేను అలానే పడుతూనే ఉంటాను. ఇప్పుడు మళ్లీ దీన్ని పొగరు, బలుపు అని అనుకుంటారు.

By:  Tupaki Desk   |   3 April 2024 4:42 AM GMT
లైగర్ 200 కోట్ల కామెంట్.. అది తప్పే కానీ..: విజయ్ దేవరకొండ
X

ఫ్యామిలీ స్టార్ సినిమాతో భారీ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ. ఈ మూవీ కోసం దూకుడుగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా.. రిలీజ్ కు అంతా సిద్ధమైంది. ఈ సందర్భంగా నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

రెండేళ్ల క్రితం లైగర్ సినిమాతో వచ్చిన విజయ్ దేవరకొండ.. భారీ డిజాస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ మూవీ ప్రమోషన్ల సమయంలో రూ.200 కోట్ల వసూళ్లు వస్తాయని విజయ్ తెలిపారు. ఇప్పుడు ఆ కామెంట్లను ప్రస్తావించారు. "కెరీర్ స్టార్టింగ్ లో నా సినిమా రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించాలని కలలు కన్నాను. నేను హీరోగా నటించిన గీత గోవిందం మూవీతో ఆ కల నెరవేరింది. ఎన్నో ప్రశంసలు కూడా వచ్చాయి" అని విజయ్ తెలిపారు.

"ఆ తర్వాత ఓ సినిమా(లైగర్) సమయంలో రూ.200 కోట్లు సాధిస్తానని చెప్పా. కానీ అది జరగలేదు. రూ.200 కోట్ల స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావని చాలా మంది నన్ను అడిగారు. అలా చెప్పడం తప్పు అని కూడా సూచించారు. కచ్చితంగా ఎప్పుడో ఒకసారి దాన్ని(రూ.200 కోట్ల వసూళ్లు) సాధిస్తాను. రూ.200 కోట్లు కొడతానని చెప్పడం అసలు తప్పు కాదు. అలా చెప్పి కొట్టకపోవడమే తప్పు" అని విజయ్ దేవరకొండ అన్నారు.

"ఏదో ఒక రోజు కచ్చితంగా నేను రూ.200 కోట్లు కొడతాను. అది కొట్టే వరకు మీరు నన్ను ఎంతైనా తిట్టండి. నేను అలానే పడుతూనే ఉంటాను. ఇప్పుడు మళ్లీ దీన్ని పొగరు, బలుపు అని అనుకుంటారు. కాదు.. ఇది నా కాన్ఫిడెన్స్. ఇండస్ట్రీలో ఇంకొకరు స్టార్ అయితే మనం అవ్వలేమా ఏంటి? ఇంకొకరు రూ.200 కోట్లు కొడితే మనం కొట్టలేమా ఏంటి?" అంటూ ఫ్యామిలీ స్టార్ మూవీ స్టైల్‍లో విజయ్ దేవరకొండ కామెంట్స్ చేశారు.

ఇక ఇదే ఈవెంట్ లో డైరెక్టర్ పరశురామ్ పై విజయ్ దేవరకొండ ప్రశంసలు కురిపించారు. పరశురామ్ లేకపోతే ఇలాంటి అవకాశం తన లైఫ్ లో వచ్చేది కాదని తెలిపారు. వీరిద్దరి కాంబోలో 2018లో వచ్చిన గీత గోవిందం మూవీ రూ.130 కోట్ల వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఫ్యామిలీ స్టార్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రం.. ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.