Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్.. క్షమాపణ కోరుకున్న దేవరకొండ

ఒకప్పుడు తమ కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక పరిస్థితుల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ వివరించారు.

By:  Tupaki Desk   |   5 April 2024 9:11 AM GMT
ఫ్యామిలీ స్టార్.. క్షమాపణ కోరుకున్న దేవరకొండ
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కథ వినగానే తన తండ్రి గుర్తొచ్చారని ప్రమోషన్లలో తెలిపారు విజయ్. అందుకే మూవీలో తన రోల్ కు తండ్రి పేరైన గోవర్ధన్ అని పెట్టుకున్నట్లు చెప్పారు. తన తండ్రి ఇచ్చిన ధైర్యంతో తాను సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినట్లు కూడా వెల్లడించారు.

తన కుటుంబంలో నాన్నే ఫ్యామిలీ స్టార్ అని అనేక ప్రమోషనల్ ఈవెంట్స్ లో చెప్పిన విజయ్ దేవరకొండ.. ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. "నా హీరో, నా స్టార్. ఆయన మా కోసం, ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు. తన సంతోషాన్ని వదులుకున్నారు. ఎప్పుడైనా తప్పు చేసి ఉంటే క్షమించండి నాన్నా. నేను ఈ రోజు ఇలా ఈ స్థాయిలో ఉన్నానంటే మీరే కారణం నాన్నా" అంటూ ఎమోషనల్ అయ్యారు విజయ్.

తన తండ్రి గర్వపడేలా చేసేందుకు ఎంతో కష్టపడుతున్నట్లు తెలిపారు విజయ్. చిన్న నాటి ఫోటోలను, తండ్రితో ఉన్న మెమోరీస్‌ ను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఆ వీడియోలో యంగ్‌ గా ఉన్న గోవర్ధన్ రావును చూస్తుంటే అచ్చం విజయ్ దేవరకొండలానే కనిపిస్తున్నారు. 90స్ లో గోవర్ధన్, ఇప్పుడు విజయ్ ఒకేలా ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

ఒకప్పుడు తమ కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక పరిస్థితుల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ వివరించారు. రోజు మొత్తంలో ప్రతీ ఖర్చును కూడా తన తండ్రి గోవర్ధన్ డైరీల్లో రాసేవారని తెలిపారు. ఇంట్లో ఏ డైరీ ఓపెన్ చేసి చూసినా ఇవే ఉండేవని చెప్పారు. తండ్రి వల్లే తనకు బాగా ధైర్యం వచ్చిందని, ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో సినీ ఇండస్ట్రీలోకి నమ్మకంతో వచ్చానని చెప్పారు.

ఇక ఫ్యామిలీ స్టార్ మూవీలో గోవర్ధన్ పాత్రలో విజయ్ దేవరకొండ, ఇందూ పాత్రలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటించారు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై ప్రముఖ నిర్మాత దిల్‍ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ సంగీతాన్ని అందించారు.