Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ.. గ్యాంగ్ స్టర్ వేషాలు

మరి ఇప్పుడు అదే విజయ్ దేవరకొండ ఓ గ్యాంగ్ స్టర్ లా మారితే, ఎలా ఉంటుందో ఊహించుకోండి.

By:  Tupaki Desk   |   25 Aug 2023 3:30 AM GMT
విజయ్ దేవరకొండ.. గ్యాంగ్ స్టర్ వేషాలు
X

ఓ మంచి ఫ్రెండ్ గా, రగడ్ లుక్ లో మోడ్రన్ దేవదాస్ లా, రొమాంటిక్ లవర్ గా, ట్యాక్సీవాలాగా, యంగ్ పొలిటీషియన్ గా, వరల్డ్ ఫేమస్ లవర్ గా, నత్తి ఉన్న పవర్ ఫుల్ బాక్సార్ గా.. ఇలా ఎన్నో పాత్రల్లో విజయ్ దేవరకొండ తన టాలెంట్ ఎంటో చూపించిన సంగతి తెలిసిందే. సినిమా రిజల్ట్ పక్కనపెడితే తన పాత్రకు పూర్తి న్యాయం చేసి పాన్ ఇండియా రేంజ్ లో యూత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.

మరి ఇప్పుడు అదే విజయ్ దేవరకొండ ఓ గ్యాంగ్ స్టర్ లా మారితే, ఎలా ఉంటుందో ఊహించుకోండి.. హా మీరు చదివేది నిజమే.. ఇప్పుడు దాన్నే నిజం చేసేందుకు రౌడీ హీరో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. విజయ్ ప్రస్తుతం నటించిన ఖుషి సినిమా త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీని తర్వాత ఆయన.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే.

జెర్సీ లాంటి స్పోర్ట్ డ్రామా ఎమోషన్ కథతో సూపర్ హిట్ కొట్టిన గౌతమ్ తిన్ననూరి ఈ సారి గేర్ మార్చి విజయ్ కోసం ఓ పవర్ ఫుల్ గ్యాంగస్టర్ కథను రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. స్టోరీ టెల్లింగ్, ఓ పాత్రను డెప్త్ గా ఎమోషన్స్ తో చూపించడం గౌతమ్ ప్రత్యేకత. అయితే ఈ సారి తన మార్క్ దర్శకత్వంకు గ్యాంగ్ స్టర్ కథను జోడించి ఎలా చూపిస్తారో చూడాలి.

ఇకపోతే గ్యాంగస్టర్ డ్రామాలకు ఆడియెన్స్ లో ఎప్పుడు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఇంటెన్సివ్ స్టోరీ టెల్లింగ్, కాంప్లెక్స్ క్యారెక్టర్స్, అండర్ వరల్డ్ ను డేంజరస్ అండ్ వైల్డ్ గా చూపిస్తూ ఆడియెన్స్ లో మంచి ఉత్సుకతను పెంచుతోంది. అసలే ఈ మధ్య లోకేశ్ కగనరాజ్, దిలీప్ నెల్సన్ కుమార్ వంటి దర్శకుల వల్ల ఆ క్రేజ్ మరింత పెరిగింది. దానికి తోడు ఈ చిత్రాలకు అనిరూధ్ మ్యూజిక్ తోడై గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

ఇక గౌతమ్ కూడా తన చిత్రానికి అనిరూధ్ నే ఎంచుకున్నారు. అయితే ఇప్పటికే రిలీజైన పోస్టర్ లో విజయ్ ఫేస్ రివీల్ చేయకుండా ఆయన కటౌట్ తరహాలో పోలీస్‌ డ్రెస్‌లో మొహానికి ముసుగు ధరించినట్లు చూపించి క్యూరియాసిటీ పెంచారు.

మరి సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా ఉన్న విజయ్ గ్యాంగ్ స్టర్ గా మారతారా అనేది చూడాలి. ఏదేమైన ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజమైతే కనుక సినిమా పక్కా రోలర్ కోస్టర్ రైడ్ గా ఉండటం ఖాయమని అంటున్నారు సినీ ప్రియులు. చూడాలి మరి ఏం జరుగుతుందో...