Begin typing your search above and press return to search.

విజయ్ సినిమా.. పూరి స్టోరీతో లింకా?

ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఉంది. కచ్చితంగా దేవరకొండ ఖాతాలో మరో హిట్ బొమ్మ అవుతుందని అంచనా వేస్తున్నారు

By:  Tupaki Desk   |   26 Aug 2023 4:58 AM GMT
విజయ్ సినిమా.. పూరి స్టోరీతో లింకా?
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పేరులో రౌడీ ఉన్న కూడా ఇప్పటి వరకు అతని నుంచి వచ్చిన సినిమాలు అన్ని కూడా క్లాస్ టచ్ తోనే ఉంటాయి. అర్జున్ రెడ్డి సినిమాలో కూడా లవ్ స్టోరీని డిఫరెంట్ కోణంలో ఆవిష్కరించిన ఎక్కువ క్లాస్ టచ్ ని సందీప్ రెడ్డి వంగా ఇచ్చాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి నటించిన ఖుషి సినిమా కూడా ఫ్యూర్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా థియేటర్స్ లోకి రాబోతోంది.

ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఉంది. కచ్చితంగా దేవరకొండ ఖాతాలో మరో హిట్ బొమ్మ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే నెక్స్ట్ విజయ్ దేవరకొండ చేయబోయే సినిమా మాత్రం చాలా ప్రత్యేకం అని చెప్పాలి. ఇప్పటి వరకు కెరియర్ లో టచ్ చేయని పాయింట్ తో విజయ్ నెక్స్ట్ మూవీ ఉండబోతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ VD 12 సినిమా తెరకెక్కుతోంది.

ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఖుషి రిలీజ్ తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడంట. పోలీస్ ఆఫీసర్ పాత్రలో కొంతభాగం కనిపించి తరువాత గ్యాంగ్ స్టార్ గా మారుతాడంట. ఈ కథ మెయిన్ స్టోరీ లైన్ కూడా అదే అని తెలుస్తోంది.

ఒక పవర్ ఫుల్ పోలీస్ గ్యాంగ్ స్టార్ గా ఎందుకు మారాడు అనే ఎలిమెంట్ తో కథాంశం నడుస్తుందని తెలుస్తోంది. ఈ రకమైన స్టోరీలైన్ తో గతంలో పూరి జగన్నాథ్ గోపీచంద్ కాంబినేషన్ లో గోలీమార్ సినిమా వచ్చింది. ఈ మూవీ ఏవరేజ్ టాక్ సొంతం చేసుకుంది. కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. ఇంచుమించు అలాంటి స్టోరీతోనే ఇప్పుడు విజయ్ మూవీ చేయబోతున్నాడు.

ఈ చిత్రంలో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ చాలా ఉంటాయంట. తనని తాను యాక్షన్ హీరోగా ఎలివేట్ చేసుకోవడానికి విజయ్ దేవరకొండకి VD 12 మంచి ఛాన్స్ అని చెప్పాలి. అయితే దర్శకుడు గౌతమ్ గత రెండు సినిమాలు ఫుల్ క్లాస్ టచ్ తో చేశాడు. అయితే మూడో ప్రయత్నం మాత్రం పవర్ ఫుల్ మాస్ కథాంశం తీసుకున్నాడు. మరి ఈ మూవీ అటు విజయ్ కి ఇటు గౌతమ్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది చూడాలి.