Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ.. మళ్ళీ ఈ కాంబో సెట్టయితే..

అర్జున్ రెడ్డి రీమేక్ గానే ఆ మూవీ తెరకెక్కింది. ఇక మూడో సినిమా విషయంలో కంప్లీట్ గా జోనర్ మార్చేసి యాక్షన్ మోడ్ లోకి సందీప్ రెడ్డి వెళ్లిపోయారు

By:  Tupaki Desk   |   31 Aug 2023 5:47 AM GMT
విజయ్ దేవరకొండ.. మళ్ళీ ఈ కాంబో సెట్టయితే..
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఓ విధంగా చెప్పాలంటే ఈ మూవీ టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి ట్ తర్వాత అలాంటి క్యారెక్టరైజేషన్స్ చాలా మంది ట్రై చేశారు. ఇక విజయ్ కి కూడా ఈ మూవీ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లోకి వెళ్లి కబీర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టారు.

అర్జున్ రెడ్డి రీమేక్ గానే ఆ మూవీ తెరకెక్కింది. ఇక మూడో సినిమా విషయంలో కంప్లీట్ గా జోనర్ మార్చేసి యాక్షన్ మోడ్ లోకి సందీప్ రెడ్డి వెళ్లిపోయారు. రణబీర్ కపూర్ తో యానిమల్ అనే మూవీ చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో సినిమా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీని తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారు.

నెక్స్ట్ అల్లు అర్జున్ తో టి-సిరీస్ లో సందీప్ రెడ్డి ఒక ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండు కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో మరో సినిమా రానుందని టాక్ తెరపైకి వచ్చింది. తాజాగా ఖుషి ప్రమోషన్ ఈవెంట్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరికైనా రవి శంకర్ ఇదే మాటని చూచాయగా చెప్పారు.

అభిమానులతో ముచ్చటించే కార్యక్రమంలో అర్జున్ రెడ్డి కాంబినేషన్ మూవీని ఎక్స్ పెక్ట్ చేయొచ్చా అనే ప్రశ్న వచ్చింది. దీనికి నిర్మాత రవిశంకర్ సమాధానం చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ లోనే విజయ్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో సినిమాని ప్లాన్ చేస్తున్నామని అన్నారు. అయితే ప్రస్తుతం ఇంకా ఈ ఆలోచన ప్రారంభదశలోనే ఉందని కూడా క్లారిటీ ఇచ్చారు.

భవిష్యత్తులో మూవీ ఉండే ఛాన్స్ అయితే ఉందని అన్నారు. ఈ సారి విజయ్, సందీప్ కాంబోలో వచ్చే మూవీ మాత్రం లవ్ స్టోరీతో ఉండకపోవచ్చని, కచ్చితంగా ఎవ్వరూ ఊహించని సబ్జెక్టుతో ప్లాన్ చేస్తామని అన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్ కావడానికి చాలా టైం పడుతుందని కూడా నిర్మాత రవిశంకర్ చెప్పడం విశేషం.