Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా రేసులో విజయ్, నాని దూకుడు

మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ తమ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇద్దరూ కూడా చిన్న స్టేజి నుంచి స్టార్ హీరోలుగా ఎదిగిన వారే.

By:  Tupaki Desk   |   18 May 2024 12:30 AM GMT
పాన్ ఇండియా రేసులో విజయ్, నాని దూకుడు
X

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వారి జాబితాలో నేచురల్ స్టార్ నాని, సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ముందు వరుసలో ఉంటారు. తమ యాక్టింగ్ తో అందరినీ మెప్పిస్తూ టాలీవుడ్ లో దూసుకెళ్తున్నారు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ తమ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇద్దరూ కూడా చిన్న స్టేజి నుంచి స్టార్ హీరోలుగా ఎదిగిన వారే.

నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన విజయ్ దేవరకొండ.. హీరోగా మారి అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. మరోవైపు అష్టా చమ్మా, అలా మొదలైంది వంటి చిన్న బడ్జెట్ సినిమాలతో తన కెరీర్ ను స్టార్ట్ చేసి.. ఇప్పుడు దసరా, జెర్సీ వంటి సూపర్ హిట్లతో తెలుగులో తన మార్కెట్ ను ఓ రేంజ్ లో పెంచుకుంటున్నారు నేచురల్ స్టార్ నాని.

చెప్పాలంటే.. టాలీవుడ్ టైర్-2 హీరోస్ లో నాని, విజయ్ దేవరకొండ రేంజే వేరు. వారు నటించిన సినిమాలకు మౌత్ టాక్ పాజిటివ్ గా వస్తే చాలు.. ఓ రేంజ్ లో వసూళ్ల వర్షం కురుస్తుంది. దీంతో వీరిద్దరూ త్వరలో టైర్-1 హీరోలుగా మారే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో మూడు, నాని చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.

చివరిగా హాయ్ నాన్న చిత్రంతో మంచి హిట్ అందుకున్న నాని.. ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత సుజిత్, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చెరో సినిమా చేయనున్నారు నాని. వీటితోపాటు బలగంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వేణుతో కూడా ఓ మూవీ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా లాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

మరోవైపు, ఇటీవల ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ.. ఆశించిన స్థాయిలో మెప్పించలేక పోయారు. ప్రస్తుతం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో పీరియాడిక్ స్పై థ్రిల్లర్ చేస్తున్నారు. రీసెంట్ గా రెండు సినిమాలు అనౌన్స్ చేశారు. టాక్సీవాలాతో హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృత్యాన్ తో మరో మూవీ చేయనున్నారు. రాజాగారు రాణివారు ఫేమ్ రవికిరణ్ కోలాతో ఓ సినిమా చేయబోతున్నారు.

అయితే విజయ్, నాని అప్ కమింగ్ మూవీస్ అన్నీ పాన్ ఇండియా చిత్రాలే కావడం గమనార్హం. మొత్తానికి ఇద్దరూ కూడా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టైర్-2 బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు సృష్టించాలని ప్లాన్ చేస్తున్నారు. తమ ఫ్యాన్స్ ను మరింత అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ మూవీస్ అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు అయితే.. వీరిద్దరూ కచ్చితంగా టైర్-1 హీరోల జాబితాలోకి చేరిపోవడం పక్కా.