Begin typing your search above and press return to search.

నాలుగు నెలల్లో రెండు రిలీజ్.. రౌడీ ప్లాన్ అదేనా..?

వరుసగా 3 ఫ్లాపులు పడినా కూడా రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు

By:  Tupaki Desk   |   1 Aug 2023 4:30 PM GMT
నాలుగు నెలల్లో రెండు రిలీజ్.. రౌడీ ప్లాన్ అదేనా..?
X

వరుసగా 3 ఫ్లాపులు పడినా కూడా రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా పూరీ డైరెక్షన్ లో వచ్చిన లైగర్ తో పాన్ ఇండియాలో రౌడీ విజృంభణ ఉంటుందని ఆశించిన ఫ్యాన్స్ కి ఆ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది. లైగర్ ఫ్లాప్ తర్వాత కొద్దిపాటి గ్యూఅప్ తోనే శివ నిర్వాణతో తన కొత్త సినిమా స్టార్ట్ చేశాడు విజయ్. ఖుషి టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో సమంత ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది. ఖుషి సినిమాలో విజయ్ సమంతల జోడీ మూవీపై పాజిటివ్ బజ్ తెచ్చేలా చేసింది.

ఇప్పటికే రిలీజైన సాంగ్స్ కూడా సినిమాపై ఆసక్తి కలిగేలా చేశాయి. ఖుషి సినిమాను సెప్టెంబర్ 1న రిలీజ్ ప్లాన్ చేశారు. ఆగష్టులో సినిమాల సందడి ముగిశాక సెప్టెంబర్ మొదటి వారం మొత్తం తనదే కావాలని ఆ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే వారం తర్వాత అంటే సెప్టెంబర్ 7న షారుఖ్ ఖాన్ జవాన్ రిలీజ్ అవుతుంది. అయినా సరే డేర్ గా తన సినిమా రిలీజ్ చేస్తున్నాడు విజయ్. ఖుషి కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుండటం విశేషం.

ఇక ఈ సినిమా తర్వాత పరశురాం తో సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ సినిమాను కూడా ఈ నాలుగు నెలల్లో పూర్తి చేసి జనవరి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు. 2024 పొంగల్ రేసులో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో విజయ్ దేవరకొండ సెప్టెంబర్ టు జనవరి నాలుగు ఐదు నెలల్లోనే రెండు సినిమాలతో ఫ్యాన్స్ ని అలరించనున్నాడు. డియర్ కామ్రేడ్ నుంచి వరుస ఫ్లాపులు పడుతున్నా రెట్టింపు ఎనర్జీతో మళ్లీ తన ప్రయత్నాన్ని చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఖుషి తో పాటుగా పరశురాం తో చేస్తున్న సినిమాతో కూడా పక్కా హిట్ అనే కాన్ఫిడెంట్ తో ఉన్నాడు.

ఈ సినిమాలతో పాటుగా గౌతం తిన్ననూరితో సినిమా ఆల్రెడీ లైన్ లో ఉంది. ఆ మూవీ కూడా కుదిరితే 2024 సమ్మర్ రేసులో దించాలని చూస్తున్నాడు విజయ్. మొత్తానికి రౌడీ హీరో ఫ్యాన్స్ కి వరుస ఫీస్ట్ అందించేందుకు ఫిక్స్ అయ్యాడు. మరి రాబోతున్న ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. ఖుషిలో విజయ్ సరసన సమంత నటిస్తుండగా.. పరశురామ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమాకు మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.