Begin typing your search above and press return to search.

కొత్త దర్శకులతో చేయలేను.. దేవరకొండ మరో ఆన్సర్!

తెలుగు, తమిళ్ భాషలలో ఏక కాలంలో ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాలలో ప్రమోషన్స్ పై విజయ్ దేవరకొండ ఫోకస్ చేశారు.

By:  Tupaki Desk   |   1 April 2024 11:06 AM GMT
కొత్త దర్శకులతో చేయలేను.. దేవరకొండ మరో ఆన్సర్!
X

తెలుగు, తమిళ్ భాషలలో ఏక కాలంలో ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాలలో ప్రమోషన్స్ పై విజయ్ దేవరకొండ ఫోకస్ చేశారు. ఈ సందర్భంగా ఓ తమిళ్ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు ఎవరైనా డెబ్యూ డైరెక్టర్స్ కి అవకాశం ఇస్తారా అని యాంకర్ విజయ్ ని ప్రశ్నించగా విజయ్ చెప్పిన ఆన్సర్ కొంత కాంట్రవర్సీకి కూడా దారి తీసింది.

డెబ్యూ డైరెక్టర్స్ తో ప్రస్తుతం సినిమాలు చేయాలని అనుకోవడం లేదని, కనీసం ఒక్క సినిమా చేసిన అనుభవం ఉంటేనే చేస్తామని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. డెబ్యూ డైరెక్టర్స్ తో చేయకూడదని ఎందుకు అనుకుంటున్నారు అని యాంకర్ మళ్ళీ ప్రశ్నించారు. కొత్త దర్శకులతో సినిమాలు చేసేటపుడు సినిమా బడ్జెట్ ని, స్కేల్ ని హ్యాండిల్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. డెబ్యూ డైరెక్టర్స్ ఈ ప్రెజర్ ని హ్యాండిల్ చేయలేరు.

కనీసం ఒక్క సినిమా అనుభవం ఉంటే అన్నింటిని హ్యాండిల్ చేయడం అలవాటై ఉంటుంది కాబట్టి పెద్దగా ప్రెజర్ ఉండదు. ఫస్ట్ మూవీ ఎప్పుడైనా కొత్త దర్శకులకి తమని తాము గ్రూమ్ చేసుకోవడానికి ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఉపయోగపడుతుంది. అలా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుకొని వచ్చి రెడీగా ఉన్నవారితో నేను వర్క్ చేస్తాను. అలాగే ప్రెజర్ ని హ్యాండిల్ చేసుకొని వచ్చేవారితో వర్క్ చేయడానికి వారికి కావాల్సింది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను.

కానీ డెబ్యూ డైరెక్టర్స్ తో సినిమాలు చేసే ధైర్యం నేను ఇప్పుడు చేయలేను. కనీసం ఒక్క సినిమా చేసిన అనుభవం ఉంటే వారితో వర్క్ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. అయితే విజయ్ అభిప్రాయాలపై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది సమర్ధిస్తూ ఉండగా మరికొంతమంది విజయ్ దేవరకొండ కామెంట్స్ ని ట్రోల్ చేస్తున్నారు.

ఇక వాటికి కూడా విజయ్ సమాధానం ఇచ్చారు. కొత్త దర్శకులను కూడా నేను బ్లాక్ చేస్తే కొత్త యాక్టర్స్ తో ఎవరు చేస్తారు? వారికి ఎలా అవకాశం ఇస్తాయి. ఒకప్పుడు నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ కొత్త వారే. ఒకరికొకరం సపోర్ట్ చేసుకొని సినిమాలు చేశాం. ఇప్పుడు అలానే వర్క్ చేసి అనుభవం పొందాలి. అలాగే నేను ఇంటర్వ్యూలో ఏమన్నాను అంటే.. కేవలం ఒక సినిమా అనుభవం ఉండాలి అన్నాను.

అది హిట్టా ఫ్లాఫా అనేది మ్యాటర్ కాదు. డైరెక్టర్ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది అనేది కావాలి. డైరెక్టర్ ను అన్ని కోణాల్లో చూడాలి. ఇప్పుడు నా సినిమాల బడ్జెట్స్ పెరిగాయి. నిర్మాత డిస్ట్రిబ్యూటర్స్ ఇలా చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. నేను వర్క్ చేస్తున్నప్పుడు నాకు క్లారిటీ ఉండాలి. నేను చేసేదే సరైనదని నాకు అనిపించాలి అంతే. కేవలం డైరెక్టర్ ఒక సినిమా అనుభవం ఉంటే చాలు. అతని టేస్ట్, మేకింగ్ స్టైల్ పై క్లారిటీ ఉంటే ఆ తరువాత కథ నచ్చితే వెంటనే ఓకే చేస్తాను.. అని విజయ్ వివరణ ఇచ్చారు.