Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ.. వచ్చేవన్ని క్రేజీ కాంబినేషన్లే..

విజయ్ దేవరకొండ లైగర్ సినిమా సక్సెస్ అయ్యి ఉంటే ఇప్పుడు విజయ్ లైనప్ మరోలా ఉండదేమో

By:  Tupaki Desk   |   11 March 2024 2:13 PM GMT
విజయ్ దేవరకొండ.. వచ్చేవన్ని క్రేజీ కాంబినేషన్లే..
X

విజయ్ దేవరకొండ లైగర్ సినిమా సక్సెస్ అయ్యి ఉంటే ఇప్పుడు విజయ్ లైనప్ మరోలా ఉండదేమో. ముఖ్యంగా కరణ్ జోహార్ తోనే ఒక సినిమా ఎనౌన్స్ చేసేవారు. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే జనగణమన సినిమా కూడా సెట్స్ పైకి వచ్చేది. కానీ లైగర్ దెబ్బకు ఆ ప్లాన్స్ క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. ఇక విజయ్ మళ్ళీ ఎప్పటిలానే తన రెగ్యులర్ ఫార్మాట్ లో సక్సెస్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు.

ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు ఆ సినిమా పరవాలేదు అనిపించింది. ఇక ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ తో పూర్తిస్థాయిలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ కాంబినేషన్లో తప్పకుండా మరొక హిట్టు అందుతుంది అనే నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

అలాగే ఈ ఏడాది విజయ్ దేవరకొండ మరొక క్రేజీ ప్రాజెక్టులో కనిపించబోతున్నాడు. ఆ సినిమా మరేదో కాదు. ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898AD సినిమా. నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమాలో విజయ్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం లో విజయ్ ఒక ఫ్రెండ్ పాత్రలో నటించాడు.

ఇక మహానటి సినిమాలో కూడా అతను సమంత కు జోడిగా నటించాడు. దీంతో ఆ బాండింగ్ తోనే అతను ఇప్పుడు నాగ్ అశ్విన్ కోరిక మేరకు కల్కి లో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్టుపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అలాగే లిస్టులో గౌతమ్ తిన్ననూరి సినిమా కూడా ఉంది. ఈ సినిమాలో అతను ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. స్పై యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కు ఆ మధ్య బ్రేకులు పడ్డాయి.

లేదంట త్వరగానే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేవారు. సీతార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లోనే రావచ్చు. ఇక విజయ్ లిస్టులో మరో ఇద్దరి దర్శకులు కూడా ఉన్నారు. త్వరలోనే న్యూ కాంబినేషన్స్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక అప్పుడెప్పుడో సుకుమార్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు విజయ్ అఫీషియల్ గానే క్లారిటీ ఇచ్చాడు. మరి ఆ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.