Begin typing your search above and press return to search.

దేవరకొండ కోసం 100 కోట్లు!

ఓ విధంగా చెప్పాలంటే స్టార్స్ తర్వాత టైర్ 2 హీరోలలో అత్యధిక మార్కెట్ వేల్యూ ఉన్న హీరోలలో విజయ్ దేవరకొండ మొదటి స్థానంలో ఉంటాడని చెప్పొచ్చు

By:  Tupaki Desk   |   3 Oct 2023 4:55 AM GMT
దేవరకొండ కోసం 100 కోట్లు!
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. ఓ విధంగా చెప్పాలంటే స్టార్స్ తర్వాత టైర్ 2 హీరోలలో అత్యధిక మార్కెట్ వేల్యూ ఉన్న హీరోలలో విజయ్ దేవరకొండ మొదటి స్థానంలో ఉంటాడని చెప్పొచ్చు. విజయ్ మూవీ ఏదైనా చాలా ఈజీగా 50 కోట్ల మార్క్ దాటేస్తూ ఉంటుంది. అతని బిజినెస్ వేల్యూ కూడా 60 నుంచి 80 కోట్ల వరకు ఉంది.

విజయ్ దేవరకొండకి చివరిగా టాక్సీవాలాతో హిట్ పడింది. ఆ తరువాత వచ్చిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవ్, లైగర్, ఖుషి సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ కాలేదు. అయిన కూడా విజయ్ దేవరకొండ మార్కెట్ మాత్రం చెక్కుచెదరలేదు. నిర్మాతలు భారీ బడ్జెట్ విజయ్ పై పెట్టడానికి ముందుకొస్తున్నారు. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ చేస్తోన్న మూవీ బడ్జెట్ 100 కోట్ల వరకు ఉంటుందంట.

ఫస్ట్ టైం కెరియర్ లో కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ మూవీ చేస్తున్నారు. విజయ్ కి ఉన్న బిజినెస్ వేల్యూకి సరైన హిట్ పడితే అతని కరెక్ట్ మార్కెట్ స్టామినా ఏంటనేది తెలిసిపోతుంది. సక్సెస్ లేకపోవడం వలన పూర్తిగా గెస్ చేయలేకపోతున్నారు. VD12కి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన సంగీతం కూడా సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఒకవేళ అదే జరిగితే వచ్చే ఏడాది విజయ్ దేవరకొండ కూడా 100 కోట్ల క్లబ్ లో చేరనున్న టైర్ 2 హీరోగా మారుతాడు. ఇప్పటి వరకు నేచురల్ స్టార్ నాని మాత్రమే టైర్ 2 హీరోలలో వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండకి గౌతమ్ తిన్ననూరి సినిమాతో ఆ ఛాన్స్ ఉంది. మరి దానిని ఎంత వరకు కరెక్ట్ గా వాడుకుంటాడు అనేది చూడాలి.

గౌతమ్ తో చేస్తోన్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే దిల్ రాజు ఇంద్రగంటి మోహన కృష్ణతో చేయాలని అనుకుంటున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ జటాయు సినిమాని విజయ్ దేవరకొండతో సెట్స్ పైకి తీసుకొని వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది.