Begin typing your search above and press return to search.

స్పై థ్రిల్ల‌ర్ VD 12 ఆపేశారా?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి సినిమా ఆగిపోయిందంటూ ప్ర‌చారం సాగుతోంది

By:  Tupaki Desk   |   17 Jan 2024 6:14 AM GMT
స్పై థ్రిల్ల‌ర్ VD 12 ఆపేశారా?
X

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి సినిమా ఆగిపోయిందంటూ ప్ర‌చారం సాగుతోంది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందనున్న ఈ చిత్రం కోసం ఏకంగా 100 కోట్ల బడ్జెట్ వెచ్చించాల్సి ఉంటుంద‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. అయితే నిర్మాణ వ్య‌యం కార‌ణంగా దీనిని నిలిపివేశార‌ని ప్ర‌చార‌మవుతోంది. అయితే ఇందులో నిజం ఎంత‌? అన్న‌ది ఆరా తీస్తే తెలిసిన సంగ‌తులివి..

ఖుషి త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యామిలీ స్టార్ షూటింగ్ పై దృష్టి సారించాడు. అదే స‌మ‌యంలో గౌత‌మ్ తిన్న‌నూరి సినిమా గురించి చ‌ర్చ‌లు సాగించాడు. కానీ ఇటీవలి ఆన్‌లైన్ గాసిప్‌ల ప్రకారం VD 12 అని పేరు పెట్టుకున్న‌ ఈ చిత్రం బడ్జెట్ పరిమితుల కారణంగా నిలిపివేసార‌ని ప్ర‌చార‌మ‌వుతోతోంది. అయితే, ఈ ప్రాజెక్ట్ ఇంకా పురోగతిలో ఉందని సినిమాకి ప‌ని చేస్తున్న‌ ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. అలాంటి నిరాధారమైన పుకార్లను లైట్ తీస్కోవాల‌ని వారు అభిమానులను కోరారు. మృణాల్ తో క‌లిసి విజ‌య్ ప్ర‌స్తుతం ఫ్యామిలీ స్టార్ షూటింగులో ఉన్నాడు. ఇది పూర్తి చేసిన తర్వాత దేవ‌ర‌కొండ‌ 12వ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ మార్చి 2024లో ప్రారంభం కానుంది.

VD 12 అనేది తాత్కాలిక టైటిల్. స్పై థ్రిల్లర్ క‌థాంశంతో రూపొంద‌నున్న ఈ చిత్రంలో విజ‌య్ గూఢచారిగా న‌టిస్తారు. శ్రీలీల క‌థానాయిక‌. శ్రీకర స్టూడియోస్ సమర్పణ‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ గూఢచారి థ్రిల్లర్‌ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు.