Begin typing your search above and press return to search.

తరుణ్ తో సినిమా.. రౌడీ ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్..!

అందరం ఎక్కడెక్కడో ఉన్నా కొన్ని విషయాలు మా అందరినీ కలిపింది. మేమందరం ఒకే కల కనడం మొదలు పెట్టాము

By:  Tupaki Desk   |   30 Oct 2023 6:47 AM GMT
తరుణ్ తో సినిమా.. రౌడీ ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్..!
X

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన కీడా కోలా సినిమా నవంబర్ 3న రిలీజ్ అవుతుంది. తరుణ్ భాస్కర్ బ్రాండ్ పేరుతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా సండే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ కి గెస్ట్ గా విజయ్ దేవరకొండ అటెండ్ అయ్యారు. అతిథిగా వచ్చిన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఈ సినిమా నవంబర్ 3న రిలీజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేయండని అన్నారు.

తనని హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఈ టీం అంతా కూడా పెళ్లిచూపులు కి పనిచేశారు. మన అందరి లైఫ్ లు కొన్ని విషయాలు డిసైడ్ చేస్తాయి. మనం ఏ డైరెక్షన్ తీసుకుంటామో.. లైఫ్ లో ఏమవుతామో.. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామో కొన్ని విషయాలు డిసైడ్ చేస్తాయి. అది పెరిగిన వాతావరణం రెండు మనం తీసుకున్న నిర్ణయం. మన ప్రతి డెసిషన్ మన లైఫ్ ని మారుస్తుంది. అది ఈరోజు మనకు తెలియదు ఒక 5, 10 ఇయర్స్ తర్వాత వెనక్కి చూసుకుంటే ప్రతి డెసిషన్ కి మనం ఎక్కడ ఉన్నామో క్లియర్ గా కనిపిస్తుంది.

ఇక మూడోది మనం కలిసే వ్యక్తులు నా లైఫ్ కూడా పెరిగిన వాతావరణం.. చూసిన లైఫ్.. తీసుకున్న నిర్ణయాలు.. కలిసిన వ్యక్తుల వల్ల ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను.. అందులో కొందరు నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగ, తరుణ్ భాస్కర్. వీళ్లందరు నా బంధువులు కాదు కలిసి పెరగలేదు ఆల్మోస్ట్ మిడ్ ట్వంటీస్ వరకు పరిచయం లేదు.

అందరం ఎక్కడెక్కడో ఉన్నా కొన్ని విషయాలు మా అందరినీ కలిపింది. మేమందరం ఒకే కల కనడం మొదలు పెట్టాము. వీళ్లే నా సపోర్ట్ సిస్టం, నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం చూసి తరుణ్ ఛాన్స్ ఇచ్చాడు. పెళ్లిచూపులు సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. అలాంటి సక్సెస్ తర్వాత ఏవైనా చేయొచ్చు.. కానీ తను నమ్మింది చేస్తాడు. అందుకే ఈ సినిమా నచ్చిన వాళ్లతో నచ్చిన కథతో చేశాడు. ఈరోజు మళ్లీ కీడా కోలాతో వస్తున్నాడు. అతను ఇండస్ట్రీకి దొరకడం అదృష్టమని అన్నారు విజయ్ దేవరకొండ.

తరుణ్ భాస్కర్ మీద నమ్మకం ఉంది. పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది నచ్చితే కీడా కోలా నచ్చుతుంది. ఇక ఈమధ్యనే తరుణ్ భాస్కర్ ఒక కథ చెప్పాడని త్వరలో ఇద్దరం కలిసి ఓ సినిమా చేస్తున్నామని అన్నారు విజయ్ దేవరకొండ. ఇక ప్రస్తుతం విజయ్ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాలోని ఐరన్ వంచాలా ఏంటి డైలాగ్ ని అనుకరిస్తూ ఫ్యాన్స్ ని అలరించారు విజయ్ దేవరకొండ.