Begin typing your search above and press return to search.

ఫేవరెట్ బోయ్స్ తో ది దేవరకొండ.. వాట్ ఏ పిక్..!

ఇంతకీ విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఆ ఫోటో ఎవరిది అంటే దర్శకులు గౌతమ్ తిన్ననూరి, సందీప్ రెడ్డి వంగ.

By:  Tupaki Desk   |   30 March 2024 9:58 AM GMT
ఫేవరెట్ బోయ్స్ తో ది దేవరకొండ.. వాట్ ఏ పిక్..!
X

వచ్చే వారం ఫ్యామిలీ స్టార్ అంటూ థియేటర్ లోకి రాబోతున్న విజయ్ దేవరకొండ మొన్నటిదాకా సినిమాను తెలుగు వరకే రిలీజ్ అనుకోగా సడెన్ గా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా చెన్నై వెళ్లి సినిమాను అక్కడ ప్రమోట్ చేసిన విజయ్ దేవరకొండ త్వరలో ముంబైలో కూడా ప్రమోట్ చేయనున్నాడు. ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ తన ఫేవరెట్ ఇద్దరు బోయ్స్ తో ఫోటో దిగాడు. ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి టూ ఫేవరెట్ బోయ్స్ అని మెసేజ్ పెట్టాడు.


ఇంతకీ విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఆ ఫోటో ఎవరిది అంటే దర్శకులు గౌతమ్ తిన్ననూరి, సందీప్ రెడ్డి వంగ. తనకు అర్జున్ రెడ్డి లాంటి హిట్ ఇచ్చి స్టార్ క్రేజ్ వచ్చేలా చేసుకున్న డైరెక్టర్ సందీప్ వంగ ఒక పక్క. తనతో నెక్స్ట్ సినిమా చేస్తున్న గౌతం తిన్ననూరి మరోపక్క విజయ్ దేవరకొండ ఆ ఇద్దరి మధ్య ఇచ్చిన స్టిల్ అదిరిపోయింది. సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమా తీయగలిగాడు అంటే విజయ్ దేవరకొండ తనని నమ్మి అర్జున్ రెడ్డి ఛాన్స్ ఇచ్చాడు కాబట్టే అని చెప్పొచ్చు.

అంతేకాదు విజయ్ లోని నటుడిని బయటకు తీసిన క్రెడిట్ కూడా సందీప్ వంగా ఖాతాలో పడింది. విజయ్ దేవరకొండ, సందీప్ వంగా మళ్లీ కలిసి చేస్తే చూడాలని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక గౌతం తిన్ననూరితో విజయ్ చేసే సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. స్పై థ్రిల్లర్ గా గౌతం తో విజయ్ చేయబోతున్న సినిమాకు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ఉందని తెలుస్తుంది. జెర్సీ తో బాలీవుడ్ లో కూడా సక్సెస్ అందుకున్న గౌతం తిన్ననూరి విజయ్ తో చేసే సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు.

ఇక సందీప్ వంగతో కూడా విజయ్ దేవరకొండ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఆమధ్య ఇద్దరు కలిసి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. సందీప్ వంగా లిస్ట్ లో ఫస్ట్ ప్రభాస్ నెక్స్ట్ అల్లు అర్జున్ ఉన్నాడు. ఆ ఇద్దరి తర్వాత విజయ్ దేవరకొండ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. యానిమల్ సీక్వెల్ గా యానిమల్ పార్క్ అనే సినిమా కూడా సందీప్ వంగ చేస్తాడని తెలిసిందే. ఎప్పుడు చేసినా ఎలా చేసినా అర్జున్ రెడ్డి కాంబో రిపీట్ అయితే మాత్రం ఆ సినిమా లెక్క వేరే రేంజ్ లో ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు.