Begin typing your search above and press return to search.

రజినీకాంత్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన రౌడీ స్టార్

తనకి బాగా యాప్ట్ అయ్యే కామెడీ అండ్ ఎమోషనల్ టచ్ ఉన్న లవ్ స్టోరీని చూపించబోతున్నాడు

By:  Tupaki Desk   |   22 Aug 2023 4:44 AM GMT
రజినీకాంత్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన రౌడీ స్టార్
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ఖుషి మూవీ ప్రస్తుతం రిలీజ్ కి రెడీ అవుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వచ్చిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. ఈ మూవీపై విజయ్ చాలా నమ్మకంతో ఉన్నారని చెప్పాలి. అలాగే సినిమాపైన కూడా పాజిటివ్ వైబ్ ఉంది. తనకి బాగా యాప్ట్ అయ్యే కామెడీ అండ్ ఎమోషనల్ టచ్ ఉన్న లవ్ స్టోరీని చూపించబోతున్నాడు.

ఈ సినిమా ప్రమోషన్స్ పై ప్రస్తుతం విజయ్ పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ పై విజయ్ దేవరకొండ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవి కాస్తా ఇప్పుడు వైరల్ గా మారడంతో పాటుగా తమిళ్ లో రజిని ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అయ్యాయి.

సూపర్ స్టార్ రజినీకాంత్ కి గత కొన్నేళ్ల నుంచి బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్ ఫ్లాప్ లు పడ్డాయని, అయితే తిరిగి జైలర్ మూవీతో ఏకంగా 500 కోట్లు కొల్లగొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యారని చెప్పారు. తెలుగు స్టేట్స్ కి వచ్చేసరికి విజయ్ చేసిన కామెంట్స్ కొంత వరకు యాప్ట్ అవుతాయి. కానీ తమిళనాడులో మాత్రం అలా లేదు. రజినీకాంత్ 2.ఓ కోలీవుడ్ లో హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీగా ఉంది.

అలాగే కాలా, పెట్ట సినిమాలు కూడా ఏవరేజ్ టాక్ వచ్చిన కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి. కబాలి కూడా తీసిపారేసే మూవీ కాదు. ఏవరేజ్ టాక్ తోనే అద్భుతమైన కలెక్షన్స్ ని సాధించింది. అతను చెప్పిన ఆరు సినిమాలలో నాలుగు సినిమాలు కమర్షియల్ సక్సెస్ అయినవే. వాటిపై పూర్తిగా స్టడీ చేయకుండా కామెంట్స్ చేయడంపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగులో కూడా రోబో 2.ఓ మూవీ కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. అయితే విజయ్ దేవరకొండ జైలర్ సినిమాతో కంపారిజన్ చేసుకొని మిగిలిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయాయని చెప్పడానికి ఎలాంటి కామెంట్స్ చేసి ఉంటాడనే టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ కామెంట్స్ మాత్రం కోలీవుడ్ లో ఖుషి సినిమాకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది.