Begin typing your search above and press return to search.

ఇకపై అలా చేయనుంటున్న విజయ్ దేవరకొండ

అయితే గతేడాది భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఆయన నటించిన లైగర్ భారీ డిజాస్టర్ గా నిలిచింది

By:  Tupaki Desk   |   10 Aug 2023 6:46 AM GMT
ఇకపై అలా చేయనుంటున్న విజయ్ దేవరకొండ
X

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. తన ఆటిట్యూడ్‍తో ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యాడు. అయితే గతేడాది భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఆయన నటించిన లైగర్ భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ వ్యవహరించిన తీరును ఎవరూ మర్చిపోలేరు. చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే ఆయన మాట్లాడిన మాటలు కోటలు దాటాయి. కానీ చేతలు మాత్రం తుస్సుమన్నాయి. దీనిపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. కానీ చివరికి 'లైగర్' భారీ ఫ్లాఫ్ అందుకోవడంతో విజయ్ పై మరింత గట్టిగా సెటైర్లు పడ్డాయి.

అయితే ఈ సినిమా డిజాస్టర్ తో విజయ్ లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. తన తీరును కూడా పూర్తిగా మార్చుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు కూడా. తాజాగా 'ఖుషి' మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఎంతో కూల్‍గా, హుందాగా బదులిచ్చారు. ఈ క్రమంలోనే 'లైగర్' ఫ్లాప్ తో పాటు తాను వ్యవహరించే తీరు గురించి కూడా మాట్లాడారు.

"ఏదైనా సినిమా ఆశించిన విధంగా ఆడకపోతే బాధ పడతాము. లైగర్‌ కన్నా ముందు ఎన్నో ఫ్లాప్స్‌, హిట్స్‌ చూశాను. గొప్ప కథలను చెప్పాలనుకుంటున్నాం. ఫలితాలు కొన్నిసార్లు బాధ పెట్టినప్పటికీ నా జర్నీని ఆపలేవు. కిందపడిపోతాననే భయం కూడా లేదు. పడితే బాధపడతాను. కానీ, నిలబడి మళ్లీ పరిగెడతాను" అని విజయ్ పేర్కొన్నారు.

అలాగే తాను ఏదైనా చెబితే అది జరుగుతుందని, అందుకే లైగర్ హిట్ అవుతుందని తాను భావించినట్లు చెప్పారు. కానీ 'లైగర్' విషయంలో అది జరగలేదని అన్నారు. దీంతో కాస్త నిరాశ చెందినట్లు తెలిపారు. అందుకే తన తర్వాతి మూడు సినిమాలకు తక్కువగా మాట్లాడాలని అనుకున్నట్టు విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.

"నా తర్వాతి మూడు చిత్రాల కోసం డెసిషన్ తీసుకున్నాను. సినిమా హిట్ అని అనిపించాకే బ్లాక్‍బాస్టర్ అని అంటాను. అప్పటివరకు నేను నా నోటిని మూసుకోవాలని అనుకుంటున్నాను. నా పనే మాట్లాడాలని భావిస్తున్నాను. ఇకపై నోరు మూసుకొని ఉంటాను" అని విజయ్ అన్నారు. మొత్తంగా కూల్ గా మాట్లాడుతూ.. తాను ఇకపై అతిగా మాట్లాడనని క్లారిటీ ఇచ్చారు.