Begin typing your search above and press return to search.

అక్కడ విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదు

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో శివ నిర్వాణ దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన మూవీ ఖుషి

By:  Tupaki Desk   |   8 Jan 2024 6:12 PM GMT
అక్కడ విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదు
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో శివ నిర్వాణ దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన మూవీ ఖుషి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా అయితే బాగుందనే టాక్ సొంతం చేసుకుంది. ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీగా ప్రశంసలు సొంతం చేసుకుంది. పాన్ ఇండియా లెవల్ లో ఐదు భాషలలో ఈ మూవీ రిలీజ్ అయ్యింది.


తమిళనాట ఈ మూవీ గత ఏడాది హైయెస్ట్ గ్రాస్ సొంతం చేసుకున్న నాన్ తమిళ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. జవాన్ తర్వాత స్థానంలో ఖుషి మూవీ కలెక్షన్స్ పరంగా నిలవడం విశేషం. ఈ సినిమా ఓవరాల్ గా 12.45 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. రౌడీ స్టార్ కెరియర్ లో కూడా తమిళనాట ఖుషి మూవీనే ఎక్కువ వసూళ్లు సొంతం చేసుకున్న మూవీగా నిలిచింది.

తాజాగా చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన యానిమల్ మూవీ కూడా ఖుషిని బీట్ చేయలేకపోయింది. సలార్ కూడా నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నట్లు తెలుస్తోంది. రౌడీస్టార్ కి కోలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉందని ఈ కలెక్షన్స్ బట్టి తెలుస్తోంది.

అలాగే సమంత కూడా తమిళంలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఉంది. అలాగే సమంత మాతృభాష కూడా తమిళ్ కావడంతో ఖుషి సినిమాకి ఎక్కువ ఆదరణ వచ్చినట్లు తెలుస్తోంది. ఖుషికి ఆదరణ రావడంతో విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమాలకి కూడా తమిళంలో మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఆయన పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే మూవీ చేస్తున్నారు. దీంతో పాటు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మూవీ కూడా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.