Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్.. విజయ్ ఎంత తీసుకున్నాడు?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

By:  Tupaki Desk   |   1 April 2024 4:18 AM GMT
ఫ్యామిలీ స్టార్.. విజయ్ ఎంత తీసుకున్నాడు?
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న లెక్కల ప్రకారం 50 కోట్ల వరకు ఫ్యామిలీ స్టార్ సినిమా బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి కాస్త తక్కువ బడ్జెట్ లోనే మూవీ చేద్దామని దిల్ రాజు ప్లాన్ చేసుకున్న కూడా ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా ఖర్చు మరింత పెరిగినట్లు టాక్.

ఇక ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. విజయ్ దేవరకొండ చివరిగా ఖుషి సినిమా కోసం 12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. అయితే ఫ్యామిలీ స్టార్ సినిమాకి ఆదనంగా మూడు కోట్లు పెంచి 15 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండకి ఇటీవల కాలంలో వరుసగా అంత పెద్ద విజయాలు లేకున్నా కూడా అతని క్రేజ్ మాత్రం యూత్ లో తగ్గలేదు. మార్కెట్లో కూడా దేవరకొండ పై సాలిడ్ బిజినెస్ జరుగుతూ ఉంది. ఈ కారణంగానే ఖుషి మూవీ యావరేజ్ అయిన కూడా ఫ్యామిలీ స్టార్ కి రెమ్యూనరేషన్ పెంచినట్లు ఇండస్ట్రీ వర్గాల మాట. ఫ్యామిలీ స్టార్ సినిమా ఫై 45 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

అలాగే డిజిటల్ రైట్స్ రూపంలో కూడా సాలిడ్ గా డబ్బులు వచ్చాయంట. అయితే 45 కోట్లు థియేటర్స్ లో కలెక్ట్ చేయాలంటే కచ్చితంగా మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ ఈ సినిమా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి విజయ్ దేవరకొండ పరశురాం కాంబినేషన్ లో గీతాగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఫ్యామిలీ స్టార్ వస్తుంది. అందుకే అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

అంచనాలు అందుకోగలిగితే దిల్ రాజు సినిమాపై పెట్టిన పెట్టుబడి వెబ్టనే రికవరీ అయ్యే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. సమ్మర్ హాలిడేస్ లో పోటీగా మరే పెద్ద సినిమాలు కూడా లేవు. దిల్ రాజు కూడా సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. తమ బ్యానర్ నుంచి గతంలో వచ్చిన ఫ్యామిలీ సినిమాల తరహా లోనే ఈ సినిమా కూడా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుందని బలంగా నమ్ముతున్నారు. చూడాలి మరి సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో.