Begin typing your search above and press return to search.

రౌడీ హీరో సాలిడ్ ఆన్సర్ ఇచ్చేందుకు సిద్ధం..!

ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ తో మరోసారి ఆలోచనలో పడ్డ విజయ్ దేవరకొండ తన సినిమాల ఫెయిల్యూర్ పై స్పెషల్ ఫోకస్ చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   12 April 2024 7:18 AM GMT
రౌడీ హీరో సాలిడ్ ఆన్సర్ ఇచ్చేందుకు సిద్ధం..!
X

ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ తో మరోసారి ఆలోచనలో పడ్డ విజయ్ దేవరకొండ తన సినిమాల ఫెయిల్యూర్ పై స్పెషల్ ఫోకస్ చేస్తున్నాడు. టాక్సీవాలా తర్వాత విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కొట్టిన సినిమా లేదు. డియర్ కామ్రెడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ 3 సినిమాల ఫలితాలు తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో లైగర్ డిజాస్టర్ కా బాప్ అనిపించుకుంది. ఆ తర్వాత వచ్చిన ఖుషి జస్ట్ ఓకే అనిపించుకున్నా విజయ్ దేవరకొండ మార్క్ వసూళ్లను చూపించలేకపోయింది.

సినిమాల ఫలితాలతో తన పంథా మార్చాలని ఫిక్స్ అయ్యాడు విజయ్ దేవరకొండ. అందుకే తన నెక్స్ట్ సినిమాకు పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. గౌతం తిన్ననూరితో విజయ్ దేవరకొండ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను సూపర్ హిట్ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు. కెరీర్ లో విజయ్ దేవరకొండకు కావాల్సిన ఎమర్జెన్సీ హిట్ అందించేందుకు కృషి చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ కూడా గౌతం తిన్ననూరి సినిమా కోసం పూర్తి ఫోకస్ పెట్టేందుకు రెడీ అవుతున్నాడట. సినిమాను ఎక్కడ తగ్గకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నాడట. జెర్సీ సినిమాతో సౌత్ తో పాటు నార్త్ లో కూడా సూపర్ హిట్ అందుకున్న గౌతం తిన్ననూరి విజయ్ తో చేస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా ఆడియన్స్ మెప్పించేలా చేస్తున్నాడట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తుంది. అందులో ఒకరు మమితా బైజు కాగా.. మరొకరి మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ అని తెలుస్తుంది.

స్పై థ్రిల్లర్ గా రాబోతున్న VD12వ సినిమాపై అంచనాలైతే భారీగా ఉన్నాయి. విజయ్ ఫ్యాన్స్ కూడా ఆయన నుంచి మరో అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి రిజల్ట్ ఆశిస్తున్నారు. ఈసారి ఆడియన్స్ అంచనాలను అందుకునేందుకు ఎలాంటి రిస్క్ అయినా చేసేందుకు రెడీ అంటున్నాడు విజయ్ దేవరకొండ. తన సినిమాలు ఏమాత్రం బాగాలేకపోయినా ఒక రేంజ్ లో నెగిటివిటీ వస్తుండగా తనపై అనవసరమైన రాద్ధాంతం చేస్తున్న వారికి కూడా సాలిడ్ ఆన్సర్ ఇచ్చేందుకు విజయ్ సంసిద్ధం అవుతున్నాడు. టాలీవుడ్ యంగ్ హీరోల్లో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న విజయ్ దేవరకొండ సరైన సినిమాతో వస్తే అద్భుతాలు చేసే ఛాన్స్ ఉంది. కానీ దాదాపు ఆరేళ్లుగా విజయ్ కు లక్ కలిసి రావట్లేదు. అందుకే గౌతం తిన్ననూరి కాంబో సినిమాతో భారీ టార్గెట్ నే పెట్టుకున్నాడు విజయ్.