Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ ఏమిటిది హాయిగా వినసొంపుగా..!

ఫ్యామిలీ స్టార్ సినిమా టీజర్ తోనే సినిమాపై అంచనాలు ఏర్పరచగా ఇప్పుడు ఈ సాంగ్ హాయిగా వినసొంపుగా ఉంది.

By:  Tupaki Desk   |   7 Feb 2024 11:24 AM GMT
విజయ్ దేవరకొండ ఏమిటిది హాయిగా వినసొంపుగా..!
X

విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. గోపీసుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ఏమిటిది అంటూ లిరికల్ సాంగ్ రిలీజైంది. అనంత్ శ్రీరామ్ రచించిన ఈ మెలోడీ సాంగ్ ని సిద్ శ్రీరామ్ ఆలపించారు. అనంత్ శ్రీరాం సాహిత్యానికి గోపీ సుందర్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఫ్యామిలీ స్టార్ సినిమా టీజర్ తోనే సినిమాపై అంచనాలు ఏర్పరచగా ఇప్పుడు ఈ సాంగ్ హాయిగా వినసొంపుగా ఉంది. ఫ్యామిలీ స్టార్ లవ్ అండ్ ఎమోషనల్ స్టోరీగా రాబోతుంది. అందుకు తగినట్టుగానే పరశురామ్ ఈ సినిమాలో సాంగ్స్ ప్లాన్ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ, పరశురామ్ ఇద్దరు కలిసి గీతా గోవిందం తో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా హిట్ సెంటిమెంట్ తో మరోసారి ఫ్యామిలీ స్టార్ కూడా అదే రేంజ్ హిట్ టార్గెట్ తో వస్తుంది. ఫ్యామిలీ స్టార్ సినిమా లో విజయ్ ఒక ఫ్యామిలీ మెన్ గా కనిపించనున్నారు. బిఫోర్ మ్యారేజ్ లవ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇంకా ఆ టైం లో వచ్చే ఇబ్బందులు తను వెళ్లే దారిలో తన పనులకు అడ్డు పడే వ్యక్తులు ఇలా కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది.

విజయ్ దేవరకొండ మృణాల్ జోడీ కూడా ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. ఆల్రెడీ సీతారామం సూపర్ హిట్ కాగా ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న కూడా సక్సెస్ అందుకుంది. రెండు సూపర్ హిట్ల తర్వాత మృణాల్ ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తుంది. విజయ్ దేవరకొండ కూడా ఖుషి సినిమా తర్వాత ఈ సినిమా తో భారీ హిట్ కి చూస్తున్నారు.

దిల్ రాజు ఈ సినిమా ప్రొడక్షన్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని తెలుస్తుంది. విజయ్ పరశురాం దిల్ రాజు ఈ కాంబో ప్రేక్షకులను ఏమేరకు ఎంటర్టైన్ చేస్తుంది. రౌడీ ఫ్యాన్స్ కోరుకునే సూపర్ హిట్ ఈ సినిమా అందిస్తుందా లేదా అన్నది తెలియాలంటే ఏప్రిల్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.