Begin typing your search above and press return to search.

SVC59: కత్తి నేనే.. నెత్తురు నాదే

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ దిల్ రాజు ప్రొడక్షన్లో మరొక సినిమా చేయబోతున్నట్లు ఇదివరకే కొన్నిసార్లు క్లారిటీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   9 May 2024 4:52 AM GMT
SVC59: కత్తి నేనే.. నెత్తురు నాదే
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ దిల్ రాజు ప్రొడక్షన్లో మరొక సినిమా చేయబోతున్నట్లు ఇదివరకే కొన్నిసార్లు క్లారిటీ ఇచ్చారు. ఫ్యామిలీ స్టార్ సినిమాతో రీసెంట్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మరొక డిఫరెంట్ సినిమాను అందించడానికి సిద్ధమవుతున్నారు. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు ఫినిష్ అయ్యాయి.


ఇక అసలైన పనులు మొదలు పెట్టడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో అఫీషియల్ గా ఒక పోస్టర్ ద్వారా మేకర్స్ మంచి అప్డేట్ అయితే ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ లో రాబోతున్న ఈ 59వ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. విజయ్ ఈసారి గతంలో కంటే భిన్నంగా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లుగా ఆ పోస్టర్ ద్వారా తెలియజేశారు.

రాజావారు రాణి గారు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న రవికిరణ్ కొల్లా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక పోస్టర్లో విజయ్ దేవరకొండకు హ్యాపీ బర్త్ డే అనే ట్యాగ్ తో విషెస్ అందిస్తూ అందులో కత్తి పట్టుకున్నట్లుగా చూపించారు. ఎరుపెక్కిన పోస్టర్ లో రక్తంతో తడిసిన చెయ్యి రక్తంతో ఉన్న కత్తిని చూస్తూ ఉంటే సినిమాలో సీరియస్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు అర్థమవుతుంది.

కత్తి నాదే నెత్తురు నాదే యుద్ధం నాతోనే.. అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు దీన్నిబట్టి విజయ్ దేవరకొండ క్యారెక్టర్ మాత్రం సరికొత్త షెడ్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. విజయ్ ఇప్పటివరకు చేసిన సినిమా లో ఒకలెక్క.. ఇప్పటినుంచి రాబోయే సినిమాలు మరొక లెక్క అనే విధంగా నెక్స్ట్ సినిమాలు రాబోతున్నట్లుగా అర్థమవుతుంది. ఎందుకంటే దర్శకుడు గౌతమ్ తో చేస్తున్న సినిమాలో అతను పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.

అలాగే మరొకవైపు టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తో చేస్తున్న ప్రాజెక్ట్ పీరియాడిక్ ఫిల్మ్ గా రాబోతోంది. దేనికవే భిన్నంగా విజయ్ దేవరకొండ సెలెక్ట్ చేసుకున్న కథలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక దిల్ రాజు ప్రొడక్షన్లో చేస్తున్న సినిమా సైతం మరింత విభిన్నంగా ఉండబోతున్నట్లుగా అర్థమవుతుంది.

ఇక ఈ సినిమాను కూడా కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టు గా తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లు ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. మరి ఈ సినిమాతో విజయ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి. ఇక ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.