Begin typing your search above and press return to search.

ప్రభాస్ స్పిరిట్ లో అర్జున్ రెడ్డి..?

కల్కి 2898 AD తో జూన్ లో రాబోతున్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత సెట్స్ మీద ఉన్న మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజా సాబ్ ని పూర్తి చేసే ప్లానింగ్ లో ఉన్నాడు.

By:  Tupaki Desk   |   18 May 2024 3:52 AM GMT
ప్రభాస్ స్పిరిట్ లో అర్జున్ రెడ్డి..?
X

కల్కి 2898 AD తో జూన్ లో రాబోతున్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత సెట్స్ మీద ఉన్న మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజా సాబ్ ని పూర్తి చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. ఇదే కాకుండా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ 2, సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిట్ ఈ రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. సలార్ 2 కి ముందు డేట్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నా ప్రశాంత్ నీల్ ఎన్.టి.ఆర్ తో సినిమాను మొదలు పెట్టి ఆ సినిమా మొదటి పార్ట్ పూర్తి చేశాక సలార్ 2 శౌర్యాంగ పర్వం చేయాలని చూస్తున్నాడట. ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ గా సలార్ 2, తారక్ సినిమా ఉండబోతాయని టాక్.

ఇక సందీప్ వంగా తో ప్రభాస్ చేయబోయే సినిమా కూడా భారీ ప్లానింగ్ తోనే వస్తున్నారు. యానిమల్ తో బాలీవుడ్ ని షేక్ చేసిన సందీప్ వంగ ప్రభాస్ తో చేసే సినిమాతో పాన్ వరల్డ్ ని టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తుంది. అందుకే స్పిరిట్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడట. అంతేకాదు ప్రభాస్ స్పిరిట్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ లో అర్జున్ రెడ్డి అదే విజయ్ దేవరకొండ నటిస్తాడని అంటున్నారు. ప్రభాస్ సినిమాలో మరో హీరో అవసరమా సోలోగానే ప్రభాస్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడని అనుకోవచ్చు. కేవలం సినిమాలో ఒక సర్ ప్రైజింగ్ రోల్ అది సినిమాకు కూడా హైలెట్ అవుతుందని విజయ్ తో చేయించాలని అనుకుంటున్నాడట సందీప్ వంగ.

విజయ్ దేవరకొండకు స్టార్ ఇమేజ్ తెచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. ఆ సినిమానే విజయ్ కు బ్రాండ్ ఏర్పడేలా చేసింది. అలాంటి సందీప్ వంగ ప్రభాస్ తో చేస్తున్న సినిమాలో ఒక రోల్ ఇస్తే విజయ్ కాదనే ఛాన్స్ లేదు. విజయ్ కూడా ఓ పక్క సోలో సినిమాలు చేస్తూనే క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. ఫ్యామిలీ స్టార్ తో అంచనాలను అందుకోలేని విజయ్ దేవరకొండ రాబోయే మూడు సినిమాలతో పెద్ద టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు. మరి వీటితో పాటుగా స్పిరిట్ లో కూడా విజయ్ దేవరకొండ ఉంటే మాత్రం ఆ లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.

ప్రభాస్ స్పిరిట్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథతో రివెంజ్ స్టోరీగా ఉంటుందని తెలుస్తుంది. సందీప్ వంగ మార్క్ హీరో క్యారెక్టరైజేషన్ తో ప్రభాస్ మెంటల్ ఎక్కించేయడం పక్కా అంటున్నారు ఆడియన్స్.