Begin typing your search above and press return to search.

విజయ్​పై​ ఇప్పుడే కాదు గతంలోనూ అలానే..

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తన మాస్​ యాటిట్యూడ్​తోనే కాదు మంచి మనసుతోనూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు

By:  Tupaki Desk   |   7 Sep 2023 2:30 AM GMT
విజయ్​పై​ ఇప్పుడే కాదు గతంలోనూ అలానే..
X

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తన మాస్​ యాటిట్యూడ్​తోనే కాదు మంచి మనసుతోనూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఎంతో మందికి తనవంతుగా సాయం చేసి అండగా నిలిచారు. తన సంపాదనలో ఎంతో కొంత విరాళంగా ప్రకటించి చాలా మందిని ఆదుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఇలా ప్రతీసారి ఆయనకు ఎదురుదెబ్బ తగులుతూనే ఉందని అర్థమవుతోంది.

కరోనా సమయంలో ఎంతో మంది సెలబ్రిటీలు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. వారిలో విజయ్​ దేవరకొండ ఒకరు. తన వంతుగా రూ.కోటీకి పైగా విరాళం ప్రకటించారు. అలాగే 'ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్'(టిడిఎఫ్), మిడిల్ క్లాస్ ఫండ్ (ఎంసీఎఫ్) అనే రెండు ఛారిటీ ట్రస్ట్​లను కూడా ఏర్పాటు చేసి నిత్యవసరాలను సరఫరా చేసాడు. అయితే ఈ విషయంపై పలు కోణాల్లో విమర్శలు వచ్చాయి.

ఇప్పుడు కూడా అలానే జరిగింది.తాజాగా తన కొత్త చిత్రం 'ఖుషి' సినిమా సక్సెస్ అవ్వడం వల్ల.. తన రెమ్యునరేషన్​లో నుంచి రూ. కోటి రూపాయలను అభిమానులకు ఇస్తానని విజయ్ ప్రకటించారు. ఇది కూడా కాంట్రవర్సీగా మారింది. విజయ్‌ చేసిన పనికి గొప్ప మనసు అంటూ కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే.. 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేసిన అభిషేక్ పిక్చర్స్​ ​ మాత్రం భిన్నంగా స్పందించి మ్యాటర్​ను కాంట్రవర్సీ చేసింది. ఆ సినిమాను పంపిణీ చేసి రూ. 8 కోట్లు నష్టపోయామని, అందుకు గానూ తమకూ సాయం చేయాలంటూ ట్వీట్‌ చేసింది. ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయిన ఆ సినిమాను.. ఇప్పుడు విజయ్ చేయబోయే మంచి పనితో ముడిపెట్టి కాంట్రవర్సీకి దారీ తిసింది.

దీనిపై విజయ్ మాట్లాడులేదు కానీ.. అభిమానులు మాత్రం విజయ్​కు అండగా నిలుస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్​కు ఓ ప్రశ్నలతో ఓ ఆటాడేసుకుంటున్నారు. విజయ్​ తన కష్టార్జితంలోని నుంచి అవసరమైన వారికి సహాయం చేస్తానని ముందుకు వస్తే.. స్వాగితించాల్సింది పోయి.. మాకు సాయం చేయడంటూ లేని గొడవకు తెరలేపింది. అయినప్పటికీ నష్టపోయారు కాబట్టి.. అడిగితే తప్పులేదు. కానీ దానికి ఓ పద్ధతి ఉంటుంది. పర్సనల్​గా కలసి రిక్సెస్ట్​ చేసి అంటే ఎంతో హుందాగా ఉండేది.. కానీ మరోలా అడిగి తమకున్న గౌరవాన్ని పాడుచేసుకుంది.

అసలే ఇప్పటికే లైగర్​ నష్టానికి సంబంధించిన లెక్కలు తేలక ఇప్పటికీ సతమతమవుతుంటే.. అభిషేక్‌ పిక్చర్స్‌ ఇప్పుడు వరల్డ్ ఫేమస్​ లవర్​ సమస్యను పైకి తీసుకుని వచ్చి.. విజయ్​ను మరింత కార్నర్ చేసేందుకు ప్రయత్నించింది.