Begin typing your search above and press return to search.

లైగర్ తర్వాత నన్ను నేను శిక్షించుకున్నా - విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఖుషి మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది

By:  Tupaki Desk   |   10 Aug 2023 4:03 AM GMT
లైగర్ తర్వాత నన్ను నేను శిక్షించుకున్నా - విజయ్ దేవరకొండ
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఖుషి మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. క్యూట్ అండ్ రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే సాంగ్స్ ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కూడా అన్ని భాషలలో పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తోంది. ప్రేమ, పెళ్లి, ఫ్యామిలీ చుట్టూ కథను అల్లుకొని అద్భుతంగా తెరపై ఆవిష్కరించినట్లు కనిపిస్తుంది.

మూడు సంఘర్షణలని చిత్రంలో దర్శకుడు శివ నిర్వాణ ఆవిష్కరించారు. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా మీట్ ఏర్పాటు చేసింది. ఇందులో అన్ని భాషలకి సంబందించిన మీడియా ప్రతినిధులతో చిత్ర యూనిట్ ఇంటరాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా లైగర్ సినిమా గురించి మీడియా నుంచి విజయ్ దేవరకొండకి క్వశ్చన్ వచ్చింది. దీనిపై విజయ్ దేవరకొండ ఆసక్తికరంగా సమాధానం చెప్పారు.

లైగర్ ఫ్లాప్ అయినంత మాత్రాన తాను ఏమీ ఫీల్ కావడం లేదని, ఎందుకంటే ఆ స్టోరీ సెలక్షన్ కూడా నా ఛాయస్. నా లైఫ్ లో కెరియర్ పరంగా ఎలాంటి గైడెన్స్ లేదు. ఫెయిల్యూర్ కచ్చితంగా రావాల్సిన అవసరం ఉంటుంది. అలా ఫెయిల్యూర్ వచ్చినపుడు మన నిర్ణయాలపైన క్లారిటీ వస్తుంది. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయం తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు. ఏదైనా అది మన ఛాయస్. కచ్చితంగా దానిని యాక్సప్ట్ చేయాలి.

అలాగే నుంచి కెరియర్ కి అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ వస్తుంది. అందుకే లైగర్ ఫెయిల్యూర్ పై నేను బాధపడటం లేదు. కాకపోతే ఒకటి మాత్రం నేర్చుకున్న మనం మాట్లాడటం కంటే మన సినిమా మాట్లాడాలి అని. అందుకే నెక్స్ట్ మూడు సినిమాల విషయంలో నన్ను నేను పనిష్ చేసుకున్న.అతిగా మాట్లాడకుండా ఉండాలని ఫిక్స్ అయ్యాను. చేసే మూవీ మాత్రమే మాట్లాడుతుంది అంటూ ఆసక్తికర సమాధానం చెప్పారు.

అలాగే ది విజయ్ దేవరకొండ పేరుని ఈ మూవీలో పెట్టుకోవడంపైన కూడా రౌడీ స్టార్ క్లారిటీ ఇచ్చారు. పేరుకి ముందు స్టార్ కంటే విజయ్ దేవరకొండ ఒక్కడే ఉంటాడు కాబట్టి ఇది నాకు బెస్ట్ ఛాయస్ గా అనిపించింది. ఇంకా ఆ ది పెట్టుకోవడం నాపై మరింత వెయిట్ పెరిగినట్లు ఫీల్ అవుతున్న. సినిమాల విషయంలో మరింత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.