Begin typing your search above and press return to search.

అతనున్నాడనే ధైర్యమే ఫ్యామిలీ స్టార్..!

విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ జంటగా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ఫ్యామిలీ స్టార్.

By:  Tupaki Desk   |   1 April 2024 9:32 AM GMT
అతనున్నాడనే ధైర్యమే ఫ్యామిలీ స్టార్..!
X

విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ జంటగా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ఫ్యామిలీ స్టార్. పరశురాం డైరెక్షన్ లో రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది. సమ్మర్ కి పర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీగా ఫ్యామిలీ స్టార్ వస్తుందని అంటున్నారు చిత్ర యూనిట్. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న సందర్భంగా విజయ్ దేవరకొండ ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు.

నిన్న మొన్న దాకా సినిమా గురించి అవుట్ ఆఫ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి ఎక్స్ క్లూజివ్ డీటైల్స్ రివీల్ చేశారు. పరశురామ్ ఈ సినిమా కథ చెప్పినప్పుడే బాగా కనెక్ట్ అయ్యానని. ఒక ఫ్యామిలీ మ్యాన్ తన ఫ్యామిలీని నిలబెట్టేందుకు ఎలా కష్టపడతాడన్నది ఈ సినిమా కథ అని అన్నారు.

ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఒకరు వెనకాల ధైర్యంగా ఉంటారు. వారు ఉన్నారనే ధైర్యంతో ముందుకు వెళ్తాము. ప్రతి ఒక్కరి లైఫ్ లో అలాంటి ఫ్యామిలీ స్టార్ ఉంటారు. తన జీవితంలో ఫ్యామిలీ స్టార్ తన తండ్రి గోవర్ధన్ రావు అని అన్నారు విజయ్ దేవరకొండ. పరశురామ్ ఈ కథ చెప్పినప్పుడే తన లైఫ్, నాన్న లైఫ్ అంతా గుర్తొచ్చాయి. అందుకే సినిమా కథ చెప్పినప్పుదే హీరో పాత్ర పేరు గోవర్ధన్ అని పెట్టమని చెప్పాను.

సమ్మర్ కి ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాగా ఫ్యామిలీ స్టార్ వస్తుందని. ఏప్రిల్ 8న తన తండ్రి బర్త్ డే ఈ సినిమా చూసి ఆయన ప్రౌడ్ గా ఫీల్ అవుతారని అన్నారు. ఏప్రిల్ 5న మీరంతా ఎంజాయ్ చేసేలా ఫ్యామిలీ స్టార్ వస్తుందని. ఫ్యామిలీ మొత్తం చేసుకునే పండుగగా ఫ్యామిలీ స్టార్ వస్తుంది. అందుకే సినిమా ప్రమోషన్స్ కూడా ఒక ఫెస్టివల్ లా చేస్తున్నామని అన్నారు విజయ్ దేవరకొండ.

పరశురాం తో ఆల్రెడీ గీతా గోవిందం సినిమా చేసిన విజయ్ దేవరకొండ ఆ హిట్ సెంటిమెంట్ రిపీట్ చేసేలా ఫ్యామిలీ స్టార్ చేశాడు. ఈ సినిమా ట్రైలర్ కూడా ఇంప్రెస్ చేసింది. గీతా గోవిందం మ్యాజిక్ ని రిపీట్ చేసేలా ఫ్యామిలీ స్టార్ అద్భుతాలు చేస్తుందా లేదా అన్నది మరో 4 డేస్ లో తెలుస్తుంది.