Begin typing your search above and press return to search.

ఆ సినిమా చూసి డైరెక్టర్ అవ్వాలనుకున్నా.. నా సామిరంగంతో కల నెరవేరింది..!

జనవరి 24న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి దర్శకుడు విజయ్ బిన్ని మీడియాతో సమావేశమయ్యారు. ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను మీడియాతో పంచుకున్నారు విజయ్ బిన్ని.

By:  Tupaki Desk   |   6 Jan 2024 1:50 PM GMT
ఆ సినిమా చూసి డైరెక్టర్ అవ్వాలనుకున్నా.. నా సామిరంగంతో కల నెరవేరింది..!
X

కింగ్ నాగార్జున లీడ్ రోల్ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న సినిమా నా సామిరంగ. ఈ సినిమాను కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్ట్ చేశారు. కొరియోగ్రాఫర్ గా ఉన్న విజయ్ బిన్ని మొదటిసారి దర్శకుడిగా చేసిన నా సామిరంగ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. జనవరి 24న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి దర్శకుడు విజయ్ బిన్ని మీడియాతో సమావేశమయ్యారు. ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను మీడియాతో పంచుకున్నారు విజయ్ బిన్ని.


కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా ఎలా టర్న్ అయ్యారు ?

దర్శకుడు కావాలనే పరిశ్రమలోకి వచ్చాను. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా చూసిన తర్వాత అన్నీ క్రాఫ్ట్స్ బాగా చేశారు, కొరియోగ్రాఫర్ కి ఆ గ్రిప్ ఉంటుందని భావించి కొన్నాళ్ళు కొరియోగ్రఫీ వైపు వెళ్లాను.

మీ తొలి సినిమానే నాగార్జున గారు లాంటి పెద్ద స్టార్ ని డైరెక్ట్ చేయడం కష్టం అనిపించిందా ?

ఇంతకుముందు నాగార్జున గారికి పాటలు చేశాను. సినిమా కూడా చాలా హ్యాపీ గా చేసుకుంటూ వెళ్లాం. దర్శకుడిగా తొలి సినిమాని నాగార్జున గారితో చేయడం నా అదృష్టం.

కొరియోగ్రఫీ వేరు డైరెక్షన్ వేరు కదా.. ఈ రెండు చేయడం ఒత్తిడి అనిపించిందా ?

లేదండీ. నాకు మొదటి నుంచి డైరెక్షన్ పైనే ఆసక్తి వుంది. కొరియోగ్రఫీ కూడా ఎక్కువ స్టొరీ టెల్లింగ్ వున్న పాటలు, మాంటేజస్ చేశాను. సరైన సమయంలో ఈ అవకాశం వచ్చింది. ఎక్కడ ఇబ్బంది లేకుండా అంతా సజావుగా జరిగింది.

ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?

ముందు నాగార్జున గారితో ఒక సినిమా చేయాలని ఆయనకి కథ చెప్పాను. అప్పుడు ఆయన ఈ కథ గురించి చెప్పి ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేయమని చెప్పారు. అప్పుడు ఈ కథని వోన్ చేసుకొని నా స్టయిల్ లో చేశాను. ఈ సినిమాలో చాలా హైస్ వుంటాయి. వింటేజ్ నాగార్జున గారు కనిపిస్తారు. నేను నాగార్జున గారిని ఎంత డిఫరెంట్ గా చూపించాలని అనుకున్నానో అంత కొత్తగా ప్రజెంట్ చేశానని భావిస్తున్నాను.

అల్లరి నరేష్, రాజ్ తరుణ్ పాత్రల గురించి ?

ఇదొక ఫ్రెండ్షిప్ మూవీ. నరేష్ గారికి నాగార్జున గారంటే పిచ్చి. వారిద్దరిని ఈ కథలో పెడితే బావుంటుందనిపించింది. నరేష్ గారు అద్భుతంగా చేశారు, వీరితో పాటు మరో యంగ్ యాక్టర్ వుండాలి. ఆ పాత్రకు రాజ్ తరుణ్ ని తీసుకున్నాం. ఇందులో ముగ్గురికి ఒకొక్క కథ వుంటుంది. ఈ కథలు ఎలా కనెక్ట్ అయి వున్నాయి? వాళ్ళ మధ్య జరిగిన సిస్ట్యువేషన్స్ ఏమిటనేది చాలా కొత్తగా వుంటాయి.

మీ వర్క్ పట్ల నాగార్జున గారు ఎంత హ్యాపీగా వున్నారు ?

-నాగార్జున గారు చాలా హ్యాపీగా వున్నారు. ఆయన ఎంతో మంది దర్శకులతో పని చేశారు. అందులో నా ప్రత్యేకత ఎమిటనేది నాగార్జున గారు చెబితేనే బావుటుంది. ఆర్టిస్ట్ సపోర్ట్ చేస్తే సినిమాని ఎంత త్వరగా పూర్తి చేయొచ్చో ఈ సినిమాతో నేర్చుకున్నాను. నాగార్జున గారు, నరేష్ గారు రాజ్ తరుణ్ అద్భుతంగా సపోర్ట్ చేశారు.

ఇందులో ఐటెం సాంగ్ సర్ ప్రైజ్ వుందని విన్నాం ?

చాలా సర్ప్రైజ్ లు వున్నాయి. అవన్నీ తెరపై చూడాల్సిందే (నవ్వుతూ)

ఆస్కార్ అవార్డ్ అందుకున్న తర్వాత కీరవాణి గారు చేసిన చిత్రమిది.. తొలి సినిమా దర్శకుడిగా ఆయనతో పని చేసిన మీ అనుభవం ?

కీరవాణి గారు చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడూ కొత్త దర్శకుడిలా చూడలేదు. నేను కోరియోగ్రఫర్ ని కాబట్టి మ్యూజిక్ సెన్స్ వుంటుంది. ఆయనకి ఏదైనా చెప్పినా ఒక సెన్స్ తోనే చెబుతుంటాడని భావించేవారు. ఆయన సపోర్ట్ ని మర్చిపోలేను. ఇప్పటివరకూ వచ్చిన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. రాబోయే మూడు పాటలు కూడా వైరల్ అవుతాయి.

ఈ సినిమా నేపధ్యం ఏమిటి ?

స్నేహం, మంచి ప్రేమకథ, చాలా మంచి ఎమోషన్ వుంటాయి. 80-90 మధ్య కాలంలో జరిగే కథ ఇది.

నా సామిరంగ టైటిల్ ఆలోచన ఎవరిది ?

నా సామిరంగా ఏఎన్ఆర్ గారి సినిమాలో ప్రజాధరణ పొందిన పాట. అది టైటిల్ అయితే బావుంటుందని అందరం కలసి తీసుకున్న నిర్ణయం ఇది.

ఈ సినిమా కోసం చాలా ఫాస్ట్ గా పని చేశారు కదా.. ఎక్కడ ఒత్తిడి అనిపించలేదా ?

డైరెక్టర్ కావడం నా డ్రీం. ఆ డ్రీం కోసం చాలా కష్టపడ్డాను. సరైన సమయంలో ఈ చిత్రం వచ్చింది. దీనికి నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. కమర్షియల్ లోనే నా సొంత స్టయిల్ ని ప్రయత్నించాను. అది ఖచ్చితంగా యూనిక్ గా వుంటుంది. ప్రేక్షకులకు నచ్చుతుంది.

నిర్మాతల గురించి ?

నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు. కావాల్సిన ప్రతిది సమకూర్చారు. అందుకే ఇంత సజావుగా సినిమా జరిగింది.

ఇందులో కొరియోగ్రఫీ మీరే చేశారా ?

నాలుగు పాటలకు నేను చేశాను. ఒక పాట విజయ్, మరో పాట దినేష్ మాస్టర్ చేశారు.

ఎలాంటి జోనర్ సినిమాలు చేయాలని అనుకుంటారు?

అన్ని జోనర్ సినిమాలు చేయాలని వుంది.