Begin typing your search above and press return to search.

నాగార్జున డైరెక్టర్.. జెర్సీ హ్యాపీ మూమెంట్..!

యువ హీరోల నుంచి స్టార్ హీరోల దాకా విజయ్ బిన్ని డాన్స్ కంపోజింగ్ చేశాడు. అయితే చిరుతో ఇప్పటివరకు ఒక్క అవకాశం కూడా రాలేదు.

By:  Tupaki Desk   |   13 March 2024 9:46 AM GMT
నాగార్జున డైరెక్టర్.. జెర్సీ హ్యాపీ మూమెంట్..!
X

కింగ్ నాగార్జునతో నా సామిరంగ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ క‌మ్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని ప్రస్తుతం జెర్సీ సినిమాలో నాని హ్యాపీ మూమెంట్ ని షేర్ చేసుకున్నాడు. ఇంతకీ అతను అంత హ్యాపీగా ఫీలైంది దేనికి అంటే మెగాస్టార్ చిరంజీవి పాటకి కంపోజ్ చేశాను డ్రీం క‌మ్ ట్రూ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కొరియోగ్రాఫర్ గా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న విజయ్ బిన్ని ఇన్నాళ్లకు మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేసే ఛాన్స్ అందుకున్నాడు.

యువ హీరోల నుంచి స్టార్ హీరోల దాకా విజయ్ బిన్ని డాన్స్ కంపోజింగ్ చేశాడు. అయితే చిరుతో ఇప్పటివరకు ఒక్క అవకాశం కూడా రాలేదు. లేటెస్ట్ గా చిరు చేస్తున్న విశ్వంభర సినిమాలో ఆ ఛాన్స్ వచ్చింది. వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా భారీ బడ్జెట్ తో వస్తుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 150 నుంచి 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సాంగ్ షూట్ జరుపుకుంటున్నారు. చిరంజీవి, త్రిషల మధ్య వచ్చే ఈ సాంగ్ ను విజయ్ బిన్ని కొరియోగ్రఫీ చేశారు. ప్రతి కొరియోగ్రాఫర్ కూడా ఒక్కసారైనా మెగాస్టార్ చిరంజీవికి డాన్స్ కంపోజ్ చేయాలని అనుకుంటాడు. విజయ్ బిన్నికి ఇదివరకు అలాంటి అవకాశం రాలేదు అయితే విశ్వంభర సినిమాలో మాత్రం ఆ ఛాన్స్ దక్కింది.

తనదైన డాన్స్ కంపోజింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విజయ్ బిన్ని నా సామిరంగ సినిమాతో డైరెక్టర్ గా మారాడు. మొదటి సినిమానే సూపర్ హిట్ అందుకున్న విజయ్ బిన్ని ఇటు కొరియోగ్రఫీ చేస్తూనే మరోపక్క డైరెక్షన్ కూడా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. చిరు విశ్వంభర లో విజయ్ బిన్ని కంపోజిషన్ బాగుంటే మెగాస్టార్ అతన్ని రిపీట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.

ఈమధ్య ఎక్కువగా చిరంజీవి శేఖర్ మాస్టర్ డాన్స్ కంపోజింగ్ లోనే సాంగ్స్ చేస్తున్నారు. మెగాస్టార్ లోని గ్రేస్ ని వాడుకుంటూ శేఖర్ మాస్టర్ మంచి మూమెంట్స్ కంపోజ్ చేస్తూ వచ్చారు. అయితే వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న విశ్వంభర సినిమాలోని సాంగ్స్ కూడా ప్రత్యేకంగా ఉంటాయని టాక్. అందుకే ఈ సినిమా కోసం విజయ్ బిన్నితో ఒక సాంగ్ చేయించారని తెలుస్తుంది.