Begin typing your search above and press return to search.

ఆ హీరో తెలుగు నేర్చుకోకపోవడం వెనక రీజన్ అదేనా..?

పాన్ ఇండియా రేంజ్ లో రికార్డులతో అదరగొడుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఇప్పుడు అందరి దృష్టి ఉంది

By:  Tupaki Desk   |   10 April 2024 5:08 AM GMT
ఆ హీరో తెలుగు నేర్చుకోకపోవడం వెనక రీజన్ అదేనా..?
X

పాన్ ఇండియా రేంజ్ లో రికార్డులతో అదరగొడుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇక్కడ మార్కెట్ పై గురి పెట్టిన ఇతర భాషల హీరోలు ఉన్నారు. ఇక్కడ ఒక సినిమా హిట్ కొడితే చాలు క్రేజ్ ఏర్పడినట్టే. ఇక వారు చేసే సినిమాలన్నిటికీ తెలుగులో మంచి బిజినెస్ ఓపెన్ అవుతుంది. తెలుగు ఆడియన్స్ ఎలాంటి వారినైనా ఆదరిస్తారు కాబట్టి ఇతర భాషల హీరోలకు కూడా ఇక్కడ డిమాండ్ బాగా ఉంటుంది.

ముఖ్యంగా కోలీవుడ్ స్టార్స్ కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. రజిని, కమల్ నుంచి శివ కార్తికేయన్ వరకు తెలుగు మార్కెట్ పై గురి పెట్టారు. వీరిలో బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కూడా ఉన్నాడు. బిచ్చగాడు తో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్ ఆంటోని ఆ తర్వాత నుంచి వరుస సినిమాలు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. డిఫరెంట్ సినిమాలతో వరుస ప్రాజెక్ట్ లు చేస్తున్న విజయ్ ఆంటోనికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

బిచ్చగాడు సూపర్ హిట్ తర్వాత మధ్యలో చాలా సినిమాలు వదిలిన విజయ్ ఆంటోని మళ్లీ బిచ్చగాడు 2 తో మరో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం అతను నటించిన లవ్ గురు సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో తనకు మెమరీ పవర్ తక్కువ అందుకే తను తెలుగు నేర్చుకోలేకపోతున్నా అని అంటున్నాడు విజయ్ ఆంటోని.

తెలుగులో తనకు మంచి ప్రేక్షకాదరణ ఉన్న కారణంగా ఇక్కడ సినిమాలు చేయాలని ఉన్నా తను తెలుగు నేర్చుకోలేకపోతున్నానని.. తనకు మెమరీ పవర్ తక్కువ ఉండటం వల్లే తెలుగు నేర్చుకోలేదని. ఒకవేళ తెలుగు వచ్చి ఉంటే తను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేసి ఇక్కడే తెలుగు సినిమాలు చేసే వాడినని చెప్పుకొచ్చారు విజయ్ ఆంటోని.

బిచ్చగాడు నుంచి తన ప్రతి సినిమాకు ఒక సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న విజయ్ ఆంటోని లవ్ గురు మాత్రం ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ తో వస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ మీద కూడా భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. బిచ్చగాడు 2 హిట్ తర్వాత విజయ్ ఆంటోని నుంచి వస్తున్న ఈ లవ్ గురు ఆయనకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. ఈసారి ఆడియన్స్ ను సీరియస్ యాక్షన్ తో కాదు కామెడీ ఎంటర్టైనర్ తో మెప్పించాలని చేసిన విజయ్ ఆంటోని ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.