Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ తో కిచుకిచు ప్లాన్‌ చేశాం...!

హీరోయిన్ మృణాళిని చాలా ఆత్మ విశ్వాసం కలిగిన అమ్మాయి. ఈ సినిమా ప్రచారం కోసం ఆమెతో కిచుకిచులు ప్లాన్‌ చేశాము.

By:  Tupaki Desk   |   16 March 2024 4:27 AM GMT
హీరోయిన్‌ తో కిచుకిచు ప్లాన్‌ చేశాం...!
X

బిచ్చగాడు సినిమాతో తెలుగు లో కూడా పాపులారిటీని సొంతం చేసుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ. ఈయన హీరోగా రూపొందిన తాజా చిత్రం 'రోమియో'. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయ్యింది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రోమియో సినిమా పై విజయ్‌ ఆంటోనీ చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. సొంత నిర్మాణ సంస్థలో కొత్త దర్శకుడు వినాయక్‌ వైధ్యనాథన్‌ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ ఈ సినిమాను నిర్మించాడు. తాజాగా సినిమా యూనిట్‌ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

దర్శకుడు వైధ్యనాథన్‌ మాట్లాడుతూ... ఒక స్త్రీ తన భర్తను ఎంత ప్రేమగా చూసుకోవాలి అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాను. ఈ కథ కు మా అమ్మ కథ ప్రేరణ. నేను ఒక షార్ట్ ఫిల్మ్‌ తీస్తే దాన్ని చూసిన విజయ్‌ గారు పిలిచి మరీ ఈ సినిమాకు అవకాశం ఇచ్చారు. ఏడాది సమయం అడిగి ఈ కథను రెడీ చేశాను అన్నాడు.

హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. మొదటి సారి లవ్‌ స్టోరీ మూవీ చేశాను. హీరోయిన్ మృణాళిని చాలా ఆత్మ విశ్వాసం కలిగిన అమ్మాయి. ఈ సినిమా ప్రచారం కోసం ఆమెతో కిచుకిచులు ప్లాన్‌ చేశాము. కానీ ఆ ఫ్రాంక్ వర్కౌట్‌ అవ్వలేదు. ఒక స్త్రీ తన భర్తను ఎంతగా హింసిస్తుంది, మగాడు ఆ హింసను ఎలా భరించాలి అనే విషయాలను ఫన్నీగా చూపించినట్లు పేర్కొన్నాడు.

తమిళంలో రూపొందిన ఈ సినిమాను తెలుగు లో కూడా పెద్ద ఎత్తున విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. బిచ్చగాడు 2 తో మళ్లీ ఫామ్‌ లోకి వచ్చిన విజయ్ ఆంటోనీ కచ్చితంగా రోమియో తో తెలుగు లో మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశాలు ఉన్నాయని అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.