Begin typing your search above and press return to search.

జీవితంలో ఇప్ప‌టికే ఎన్నో కోల్పోయా! విజ‌య్ ఆంటోనీ

న‌టుడు విజ‌య్ ఆంటోనీ కుమార్తె మీరా ఆత్మ‌హ‌త్య అనంత‌రం దుఖాన్ని దిగ‌మింగి 'ర‌త్తం' సినిమా ప్ర‌మోష‌న్ లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   30 Sep 2023 5:49 AM GMT
జీవితంలో ఇప్ప‌టికే ఎన్నో కోల్పోయా! విజ‌య్ ఆంటోనీ
X

న‌టుడు విజ‌య్ ఆంటోనీ కుమార్తె మీరా ఆత్మ‌హ‌త్య అనంత‌రం దుఖాన్ని దిగ‌మింగి 'ర‌త్తం' సినిమా ప్ర‌మోష‌న్ లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. చెన్నైలో జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట కి విజ‌య్ చిన్న కుమార్తెతో క‌లిసి వ‌చ్చారు. త‌న వ్య‌క్తిగ‌త కార‌ణాలుగా నిర్మాత న‌ష్ట‌పోకూడ‌ద‌ని బాధ‌ని దిగమింగి ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా విజ‌య్ ఆంటోని భావోద్వేగానికి గుర‌య్యారు. బ‌రువెక్కిన హృద‌యంతో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు అభిమానుల కంట క‌న్నీరు పెట్టించాయి.

'ఇప్ప‌టికే జీవితంలో ఎన్నో కోల్పోయాను. జీవితంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియ‌దు. బాధ‌తో జీవించ‌డం అల‌వాటు చేసుకున్నా. బాధ‌ల నుంచి ఎంతో నేర్చుకున్నా' అని భావోద్వేగానికి గుర‌య్యారు. విజ‌య్ ఆంటోని మైక్ ప‌ట్టుకుని అలా బ‌రువెక్కిన హృద‌యంతో మాట్లాడుతుంటే అభిమాను లు ఒక్క‌సారిగా ఎమోష‌న్ కి గుర‌య్యారు. గుండెల్లో అంత బాధ పెట్టుకుని సినిమా ఈవెంట్ కి రావ‌డం ప‌ట్ల అభిమానుల్ని మ‌రింత క‌ల‌చి వేసింది.

పుట్టెడు దుఖంలోనూ మీ బాధ‌ను ప‌క్క‌న‌బెట్టి నిర్మాత న‌ష్ట‌పోకూడ‌ద‌ని మీరు ఇక్క‌డికి రావ‌డం చూస్తే మీరెంతో గొప్ప మ‌నిషో అర్ద‌మ‌వుతుందంటూ సోష‌ల్ మీడియాలో నెటి జ‌నులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. స‌మాజంపై మీకున్న బాధ్య‌త ఎంతో గొప్ప‌ది. మీకంటే..మీకుటుంబం కంటే ఎక్కువ‌గా సమాజం కోసం ఆలోచిస్తారు. అందుకే గొప్ప సేవా కార్య‌క్ర‌మాలు చేయ‌గ‌ల్గుతున్నారు. మీ సినిమాల ద్వారా ఎంతో గొప్ప సందేశం ప్ర‌జ‌ల్లోకి వెళ్తుంది.

ఆ దుఖాల‌న్ని తొల‌గిపోయి సంతోషంగా ఉండే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయి..మీరు ధైర్యంగా ఉండంటి అంటూ అభిమానులు ధైర్యం చెబుతున్నారు. కోలీవుడ్ లో ఎంత‌మంది స్టార్లు ఉన్నా విజ‌య్ ఆంటోనీ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్న న‌టుడు. న‌టుడిగా..సంగీత ద‌ర్శ‌కుడిగా..ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్నారు. స‌మాజంలో చోటు చేసుకునే సంఘ‌ట‌న‌లు ఆధారంగా సినిమాలు చేయ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌.