Begin typing your search above and press return to search.

విజయ్ అంటోనికి కోలుకోలేని దెబ్బ

ఓ విధంగా విజయ్ ఆంటోనీ కెరియర్ లో డిజాస్టర్ ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చిన చిత్రంగా హత్య మూవీ నిలిచింది.

By:  Tupaki Desk   |   25 July 2023 5:05 AM GMT
విజయ్ అంటోనికి కోలుకోలేని దెబ్బ
X

కోలీవుడ్ లో టాలెంటెడ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు విజయ్ అంటోనీ. మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన విజయ్ అంటోనీ తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగు, తమిళ్ భాషలలో స్టార్ హీరోల సినిమాలకి సైతం మ్యూజిక్ అందించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు ఉన్న సమయంలోనే హీరోగా టర్న్ తీసుకున్నాడు.

ప్రస్తుతం కేవలం తన సినిమాల వరకు మాత్రమే విజయ్ అంటోనీ మ్యూజిక్ అందిస్తున్నారు. బయట ప్రాజెక్ట్స్ చేయడం లేదు. ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే బిచ్చగాడు అని చెప్పాలి. రీసెంట్ గా ఆ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన బిచ్చగాడు 2 కూడా మిక్స్ రెస్పాన్స్ వచ్చి కలెక్షన్స్ పరంగా హిట్ అయ్యింది.

ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. ఇదే స్పీడ్ లో హత్య అనే మరో చిత్రంతో విజయ్ ఆంటోనీ ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని బాలాజీ కుమార్ తెరకెక్కించారు. విజయ్ ఆంటోనీ డిటెక్టివ్ గా ఈ మూవీలో కనిపించారు. మీనాక్షి చౌదరి, రితికా సింగ్ లీడ్ రోల్ లో కనిపించారు. కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తోనే ఈ మోపివిఎని ఆవిష్కరించారు.

ట్రైలర్ ఈ మూవీ పై కొంత వరకు అంచనాలు క్రియేట్ చేసింది. అయితే థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత ఆ అంచనాలు మాత్రం మూవీ అందుకోలేకపోయింది.

విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2 కంటే హత్యకి ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదని చెప్పాలి. ఓ విధంగా విజయ్ ఆంటోనీ కెరియర్ లో డిజాస్టర్ ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చిన చిత్రంగా హత్య మూవీ నిలిచింది.

ఏ మాత్రం ఆడియన్స్ ని థియేటర్స్ వద్దకి ఈ చిత్రం రప్పించలేకపోయింది. దీనికి ప్రమోషన్ లోపం కూడా కారణం అని చెప్పొచ్చు. అంతకు ముందు బిచ్చగాడు 2కి చేసిన స్థాయిలో ప్రమోషన్స్ హత్య మూవీకి జరగలేదు.

ఈ కారణంగానే తెలుగు రాష్ట్రాలలో విజయ్ ఆంటోనీ నుంచి హత్య అనే ఒక సినిమా థియేటర్స్ లోకి వస్తుందనే విషయం కూడా ఎవరికి తెలియలేదు. దీంతో ఓవరాల్ గా సినిమా వీకెండ్ పూర్తయ్యేసరికి వాష్ అవుట్ అయిపొయింది. ఇప్పటికే చాలా థియేటర్స్ ని మూవీని తీసేసినట్లు తెలుస్తోంది.