Begin typing your search above and press return to search.

విజ‌య‌నిర్మల వేల కోట్ల‌ ఆస్తిలో మ‌న‌వ‌డి వాటా ఎంత‌?

కృష్ణ‌- విజ‌య‌నిర్మ‌ల ఇరువురూ స్వ‌ర్గ‌స్తుల‌య్యాక ఈ చిక్కు ప్ర‌శ్న ముందుకు వ‌చ్చింది. అయితే దీనికి ఎవ‌రో స‌మాధానం చెబితే అంత క్లారిటీ ఉండ‌దు

By:  Tupaki Desk   |   30 Aug 2023 4:35 AM GMT
విజ‌య‌నిర్మల వేల కోట్ల‌ ఆస్తిలో మ‌న‌వ‌డి వాటా ఎంత‌?
X

సూప‌ర్ స్టార్ కృష్ణ‌- విజ‌య‌నిర్మ‌ల దంప‌తుల వేల కోట్ల ఆస్తుల గురించి ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగుతుంటుంది. చాలా మంది ప్ర‌జ‌ల‌కు సెల‌బ్రిటీల ఆస్తి పంప‌కాల గురించి గొప్ప ఆసక్తి. అదే క్ర‌మంలో విజ‌య‌నిర్మ‌ల మ‌న‌వ‌డు న‌వీన్ కృష్ణ‌కు ఆస్తి ఎంత రాసిచ్చారు? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి.

కృష్ణ‌- విజ‌య‌నిర్మ‌ల ఇరువురూ స్వ‌ర్గ‌స్తుల‌య్యాక ఈ చిక్కు ప్ర‌శ్న ముందుకు వ‌చ్చింది. అయితే దీనికి ఎవ‌రో స‌మాధానం చెబితే అంత క్లారిటీ ఉండ‌దు. అందుకే దీనిపై న‌వీన్ కృష్ణ ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పూర్తి క్లారిటీ ఇచ్చారు. నిజానికి విజ‌య‌నిర్మ‌ల వార‌సుడైన న‌టుడు న‌రేష్ కి మొద‌టి భార్య కుమారుడు-న‌వీన్ కృష్ణ‌.. రెండో భార్య కుమారుడు-ర‌ణ‌వీర్ .. మూడో భార్య (ర‌మ్య ర‌ఘుప‌తి) కుమారుడు - తేజ‌. విజ‌య్ కృష్ణ ఇంత‌కుముందు టాలీవుడ్ కి హీరోగా కూడా ప‌రిచ‌య‌మ‌య్యాడు. అయితే అత‌డికి వార‌స‌త్వంగా వ‌చ్చిన నాన్న‌మ్మ ఆస్తిని న‌రేష్ రాసిచ్చేశారా? అంటే అలాంటిదేమీ లేద‌ని న‌వీన్ కృష్ణ అన్నారు.

నాన్న‌తో ఎలాంటి గొడ‌వ‌ల్లేవ్. మామ‌ధ్య‌ ఆస్తి పంప‌కాలు ఏవీ లేవు. అయితే నాన్న‌మ్మ (విజ‌య‌నిర్మ‌ల‌) మాత్రం స‌గం ఆస్తిని నాకు రాసివ్వాల‌ని చెప్పేవారు. నాన్న‌కు స‌గం ఆస్తి ఉండాల‌ని కోరారు. ఆ ప్ర‌కార‌మే అంతా జ‌రుగుతుంది. అయితే నాకు ఇంకా ఆస్తుల గురించి అంత‌గా నాలెజ్ లేదు. ఇక త‌మ్ముళ్లు ర‌ణ‌వీర్ - తేజ అంటే నాకు చాలా ఇష్టం. తేజ తో నాకు ప్ర‌త్యేక బాండింగ్ ఉంది. వాడికి నేనంటే అంతే గొప్ప ఇష్టం ఉంది అని కూడా న‌వీన్ కృష్ణ తెలిపారు. తాత‌య్య‌- నాయ‌న‌మ్మ‌ల ఆస్తులకు తాము గార్డియ‌న్స్ మాత్ర‌మేన‌ని ఆ ఆస్తులేవీ తాము సంపాదించ‌లేద‌ని కూడా న‌వీన్ కృష్ణ నిజాయితీగా అంగీక‌రించారు.

అయితే 'నందిని న‌ర్సింగ్ హోమ్' సినిమాలో న‌టించాక న‌వీన్ వ‌రుస‌గా ల‌ఘు చిత్రాల్లో న‌టించాడు. అదే స‌మ‌యంలో అత‌డు ఒక అద్దె అపార్ట్ మెంట్ లో నివ‌శించాడు. కానీ త‌న తండ్రి గారు న‌రేష్, తాత‌య్య నాయ‌న‌మ్మ‌ల‌తో మంచి అనుబంధం కొన‌సాగించాడు. ఇక నాయ‌న‌మ్మ‌ మ‌ర‌ణించాక అత‌డు ఆమె (విజ‌య‌నిర్మ‌ల‌) ఉన్న ఇంట్లోకే మారాడ‌ట‌. కానీ అక్క‌డ ఎంతో కాలం ఉండ‌డు. త‌న‌కు ఇండివిడ్యువాలిటీ ఉంది. అందుకే సంపాదించుకుంటూ త‌న‌కంటూ ఒక ఇంటిని ఏర్పాటు చేసుకుని అందులో ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌తాన‌ని న‌వీన్ కృష్ణ అన్నారు.

లేడీ బాస్ విజ‌య‌నిర్మ‌ల‌:

సీనియ‌ర్ ద‌ర్శ‌కురాలిగా దివంగ‌త‌ విజ‌య‌నిర్మ‌ల 44 చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోను న‌మోదైంది. సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన చాలా చిత్రాల‌కు విజ‌య‌నిర్మ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో లేడీ డైన‌మైట్ గా ఆమెకు ఉన్న గుర్తింపు అసాధార‌ణం. విజ‌య‌నిర్మ‌ల వార‌సుడు న‌రేష్ ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ న‌టుడిగా క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఇదే కుంటుంబం నుంచి మూడో త‌రం న‌టుడిగా న‌వీన్ కృష్ణ సినీఇండ‌స్ట్రీలో నిరూపించాల్సి ఉంది.